ఆ విషయంలో బాలయ్యను ఆదర్శంగా తీసుకున్న పవన్ కళ్యాణ్..

బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ (Twitter/Photos)

అవును పవన్ కళ్యాణ్.. ఇపుడు ఆ విషయంలో బాలయ్యను ఆదర్శంగా తీసుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    అవును పవన్ కళ్యాణ్.. ఇపుడు ఆ విషయంలో బాలయ్యను ఆదర్శంగా తీసుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. ఒక వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే శ్రీరామ్ వేణు దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమా రీమేక్ ‘లాయర్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. పింక్ రీమేక్ కోసం కేవలం 25 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడు పవన్. ఇదిలా ఉంటే పింక్ రీమేక్‌తో పాటు మరో రెండు సినిమాలు కూడా పవన్ ఓకే చేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఈ చిత్రాన్ని జనవరి 27న ప్రారంభించనున్నట్టు సమాచారం.  క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించబోతున్నాడు. పవన్ కల్యాణ్ 27వ సినిమా ఇది. ఈ సినిమాలో పవన్ దొంగగా నటించబోతున్నాడని.. ఇది టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అని కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ప్రచారం అయితే జోరుగానే జరుగుతుంది. పింక్ సినిమాతో పాటే ఈ సినిమాను కూడా ఒకేసారి పట్టాలెక్కించడానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్.

    pawan kalyan follows nandamuri balakrishna in this way,balakrishna,pawan kalyan,pawan kalyan pragya jaiswal,balakrishna pawan kalyan,balayya,nbk,pawan kalyan twitter,pawan kalyan 27th movie,pawan kalyan 27,pawan kalyan 26th movie,pawan kalyan puri jagannadh,pawan kalyan krish movie,ananya,ananya mallesham movie,ananya instagram,pawan kalyan ananya,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni pawan kalyan,samantha akkineni rejects pink remake,pawan kalyan,pawan kalyan movies,pawan kalyan new movie,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan songs,pawan kalyan pink remake,pawan kalyan reentry in movies with pink remake,pink remake,nivetha thomas in pawan kalyan pink telugu remake,power star pawan kalyan,pink remake pawan kalyan,pawan kalyan pink movie,pawan kalyan latest movie,pawan kalyan latest updates,pawan kalyan fans,telugu cinema,పవన్ కల్యాణ్,సమంత అక్కినేని,అనన్య,పవన్ కల్యాణ్ 27వ సినిమా,పవన్ కల్యాణ్ 26వ సినిమా,అనన్య పవన్ కల్యాణ్,పింక్ రీమేక్,సమంత పవన్ కల్యాణ్,అత్తారింటికి దారేది పవన్ సమంత,తెలుగు సినిమా,పింక్ రీమేక్‌లో నటించనంటున్న సమంత అక్కినేని,పవన్ కళ్యాణ్,బాలకృష్ణ,బాలయ్య పవన్ కళ్యాణ్,ప్రగ్యా జైస్వాల్,
    పవన్ కళ్యాణ్ సరసన ప్రగ్యా జైస్వాల్ (Instagram/Photo)


    ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అంతగా ఫామ్‌లో లేని  ప్రగ్యా జైస్వాల్ ను హీరోయిన్‌గా తీసుకోనున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్.. తన సినిమాల్లో పెద్ద హీరోయిన్ ఉండాలని పట్టు బట్టడు. ఈ కోవలోనే ప్రగ్యాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చినట్టు సమాచారం. బాలయ్య కూడా తన సినిమాల్లో కూడా అంతగా ఫామ్‌లోని హీరోయిన్స్‌నే ఎక్కువగా తీసుకుంటాడు. రీసెంట్‌గా ‘రూలర్’లో ఎపుడో ఫేడౌట్ అయిన వేదికను హీరోయిన్‌గా తీసుకున్నాడు. అదే రూట్లో పవన్ కళ్యాణ్.. తాజాగా ప్రగ్యాకు తన సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చినట్టు సమాచారం. గతంలో పవన్.. కృతి కర్బందా, ప్రణీత, అనూ ఇమ్మాన్యుయేల్ వంటి ఫ్లాప్ హీరోయిన్‌లకు పవన్ కళ్యాణ్ అవకాశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా హీరోయిన్స్ విషయంలో బాలయ్యను ఆదర్శంగా తీసుకున్నట్టు కనబడుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: