ఆ విషయంలో అన్నయ్య చిరంజీవిని ఫాలో కావాలని డిసైడ్ అయ్యాడు పవన్ కళ్యాణ్. వివరాల్లోకి వెళితే.. జనసేన అధినేతగా పూర్తిస్థాయి రాజకీయాల్లో వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనని ఖరాఖండిగా ఎన్నోసార్లు చెప్పాడు. ఒకేసారి సినిమాలు, రాజకీయాలనే రెండు పడవలపై ప్రయాణం తనవల్ల కాదన్నాడు. కానీ మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. మళ్లీ ముఖానికి రంగేసుకొని మళ్లీ నటనపై దృష్టి కేంద్రీకరించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇప్పటికే హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు. చేస్తా అని చెప్పాడు కానీ.. ఈ సినిమా ఎపుడు పట్టాలెక్కాలనేది ఇంకా తేలలేదు. కానీ ఇప్పటికే దిల్ రాజు.. తమన్‌తో ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టేసాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట అయ్యాయి. ‘లాయర్ సాబ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్.. రూ.50 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకోవైపు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్.. కేవలం 20 నుంచి 30 రోజల కాల్షీట్స్ కేటాయించినట్టు చెబుతున్నారు. ఈ సినిమాను ఎంసీఏ ఫేమ్ శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే కదా.

క్రిష్ పవన్ కల్యాణ్ సినిమా
ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్... క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీకీ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్.. ఒక బందిపోటు దొంగ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అంతకు ముందు పవన్ కళ్యాణ్ తన ఓన్ డైరెక్షన్లో స్టార్ట్ చేసి ఆగిపోయిన ’సత్యాగ్రాహి’ స్టోరీని క్రిష్ దర్శకత్వంలో చేయాలనుకున్నాడు. కానీ ఆ స్క్రిప్ట్‌లో ఇంకా మార్పులు చేర్పులు చేయాల్సి ఉండటంతో .. క్రిష్ తన దగ్గర ఉన్న కథతో పవన్ కళ్యాణ్‌ను మెప్పించాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మించనున్నాడు. ఈసినిమాను బాహుబలి, సైరా నరసింహారెడ్డి చిత్రాల్లా.. ప్యాన్ ఇండియా లెవల్లో క్రిష్ తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య చిరంజీవి బాటలోనే క్రిష్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో చేయడం పక్కా అని చెప్పొచ్చు.
Published by:Kiran Kumar Thanjavur
First published:December 25, 2019, 07:40 IST