news18-telugu
Updated: March 2, 2020, 9:24 PM IST
పవన్ కళ్యాణ్ (File/Photo)
PSPK26 First Look : జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోర్టు మెట్లు ఎక్కాడు. అయితే పవర్ స్టార్ కోర్టు మెట్లు ఎక్కింది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించాడు. అంతేకాదు సినిమాలు చేయనని ఖరాఖండిగా ఎన్నోసార్లు చెప్పాడు. కానీ ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. మళ్లీ ముఖానికి రంగేసుకొని నటనపై దృష్టి కేంద్రీకరించాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్ ‘వకీల్ సాబ్’ మూవీలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో టైటిల్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. పింక్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ లాయర్ పాత్రను పోషించాడు. అదే లాయర్ పాత్రను తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఈ రకంగా పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ సాక్షిగా కోర్టు మెట్లు ఎక్కాడు.

వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ (Twitter/Photo)
‘వకీల్ సాబ్’ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోందని సమాచారం. ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌కల్యాణ్ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇదే సినిమాను తమిళంలో అజిత్ హీరోగా ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్టైయింది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
March 2, 2020, 9:24 PM IST