వావ్.. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మహేష్ రాజకీయ సలహాలు..

సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన.. కింగ్ మేకర్ పాత్ర షోషిస్తుందనుకుంటే.. చావు తప్పి కన్నులొట్టపోయినట్టు ఒక్కసీటుతో సరిపెట్టుకుంది. అంతేకాదు జనసేనాని పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమి పాలు కావడాన్నిజనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్‌కు రాజకీయ సలహాలు ఇచ్చేవారిలో మహేష్ కూడా ఉన్నాడు.

news18-telugu
Updated: June 24, 2019, 11:36 AM IST
వావ్.. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మహేష్ రాజకీయ సలహాలు..
పవన్ కళ్యాణ్
  • Share this:
సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన.. కింగ్ మేకర్ పాత్ర షోషిస్తుందనుకుంటే.. చావు తప్పి కన్నులొట్టపోయినట్టు ఒక్కసీటుతో సరిపెట్టుకుంది. అంతేకాదు జనసేనాని పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమి పాలు కావడాన్నిజనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. మరోవైపు ఏపీలో వైసీపీ 151 సీట్లతో ప్రభంజనం సృష్టిస్తే..తెలుగు దేశం పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. ఇక ఫలితాల అనంతరం ఏపీలో టీడీపీకి భవిష్యత్తు లేదని కీలక నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ కోవలో టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో కండువా కప్పుకోవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అంతేకాదు మరికొంత మంది నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ తుణంలో ఏపీలో అధికార వైసీపీకి ప్రత్యామ్నాయం జనసేన పారటీ అవుతుందని మరోవైపు జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు 2024లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడానికి తన దగ్గర మూడు దారులున్నాయని ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్‌కు తన కంటే పెద్ద అభిమాని ఎవరు లేరన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడాన్ని తట్టుకోలేకక తాను రెండు పెగ్గులును మిత్రలతో కలిసి పంచుకున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాన్ రాజకీయ భవిష్యత్తుపై బెంగతో ఉన్నానని చెప్పారు.

Pawan Kalyan: Film Critic kathi mahesh given three ideas to Janasena Chief Pawan kalyan for How to Become ap Cm In 2024,pawan kalyan,kathi mahesh,pawan kalyan kathi mahesh,janasena chief pawan kalyan,janasena,kathi mahesh given political ideas to pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,pawan kalyan fans,pawan kalyan vs katti mahesh,kathi mahesh on pawan kalyan,pawan kalyan vs kathi mahesh,mahesh kathi,pawan kalyan fans angry on katti mahesh,pawan kalyan fans warning to mahesh kathi,pawan kalyan speech,kathi mahesh vs pawan kalyan fans,kathi mahesh vs pawan kalyan,pawan kalyan about kathi mahesh,pawan kalyan fans on kathi mahesh,andhra pradesh news,andhra pradesh politics,పవన్ కళ్యాణ్,కత్తి మహేష్,పవన్ కళ్యాణ్ కత్తి మహేష్,పవన్ కళ్యాణ్‌కు కత్తి మహేష్ రాజకీయ సలహాలు,టాలీవు్డ న్యూస్,తెలుగు సినిమా,
పవన్ కళ్యాణ్,కత్తి మహేష్


అందులో మొదటి దారి.. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఎలాగో కాల గర్భంలో కలిసిపోయే అవకాశాలున్నాయి. కనుక ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలనుకుంటే గ్రామ,మండల స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయానలున్నారు. అంతేకాదు పార్టీ నిర్మాణానికి సానుభూతి పరుల నుంచి ప్రజల నుంచి తగిన ఆర్ధిక వనరులు సమకూర్చుకోవాలన్నారు. అంతేకాదు కాపుల ప్రాభల్యం ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాలతో పాటు వెనకబడిన ఉత్తరాంధ్ర,రాయలసీమ ప్రాంతాల్లో ఫోకస్ పెట్టాలన్నారు. అంతేకాదు సాధ్యమనంత ఎక్కువగా ప్రజల్లో ఉండాలన్నారు.

Pawan Kalyan: Film Critic kathi mahesh given three ideas to Janasena Chief Pawan kalyan for How to Become ap Cm In 2024,pawan kalyan,kathi mahesh,pawan kalyan kathi mahesh,janasena chief pawan kalyan,janasena,kathi mahesh given political ideas to pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,pawan kalyan fans,pawan kalyan vs katti mahesh,kathi mahesh on pawan kalyan,pawan kalyan vs kathi mahesh,mahesh kathi,pawan kalyan fans angry on katti mahesh,pawan kalyan fans warning to mahesh kathi,pawan kalyan speech,kathi mahesh vs pawan kalyan fans,kathi mahesh vs pawan kalyan,pawan kalyan about kathi mahesh,pawan kalyan fans on kathi mahesh,andhra pradesh news,andhra pradesh politics,పవన్ కళ్యాణ్,కత్తి మహేష్,పవన్ కళ్యాణ్ కత్తి మహేష్,పవన్ కళ్యాణ్‌కు కత్తి మహేష్ రాజకీయ సలహాలు,టాలీవు్డ న్యూస్,తెలుగు సినిమా,
కత్తి మహేష్ (ఫైల్ ఫోటో)




ఇక రెండోది.. బీజేపీ పార్టీ టీడీపీ లేకుండా చేసి, వాళ్లు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్నారు. కానీ ఆ  పార్టీలో జనాకర్షణ ఉన్న నాయకులు లేరు. అంతేకాదు జనసేనను బీజేపీలో విలీనం చేసేసి, పవన్ కల్యాణ్‌కు బీజేపీ పగ్గాలు పట్టుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందంటున్నారు. ఆర్థిక, మానవ వనరుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అదృష్టం బాగుంటే ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు. లేకపోతే.. దేశంలోని ఏ రాష్ట్రానికో గవర్నరో, దేశానికి ఉప రాష్ట్రపతి కూడా కాావొచ్చంటూ సలహా ఇచ్చాడు.

Pawan Kalyan: Film Critic kathi mahesh given three ideas to Janasena Chief Pawan kalyan for How to Become ap Cm In 2024,pawan kalyan,kathi mahesh,pawan kalyan kathi mahesh,janasena chief pawan kalyan,janasena,kathi mahesh given political ideas to pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,pawan kalyan fans,pawan kalyan vs katti mahesh,kathi mahesh on pawan kalyan,pawan kalyan vs kathi mahesh,mahesh kathi,pawan kalyan fans angry on katti mahesh,pawan kalyan fans warning to mahesh kathi,pawan kalyan speech,kathi mahesh vs pawan kalyan fans,kathi mahesh vs pawan kalyan,pawan kalyan about kathi mahesh,pawan kalyan fans on kathi mahesh,andhra pradesh news,andhra pradesh politics,పవన్ కళ్యాణ్,కత్తి మహేష్,పవన్ కళ్యాణ్ కత్తి మహేష్,పవన్ కళ్యాణ్‌కు కత్తి మహేష్ రాజకీయ సలహాలు,టాలీవు్డ న్యూస్,తెలుగు సినిమా,
పవన్ కళ్యాణ్‌కు కత్తి మహేష్ సలహాలు


ఇక మూడోది.. ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ చాలా బలహీనంగా ఉంది. ఆ పార్టీని సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న కమ్మ సామాజిక వర్గ నేతలు తెప్పతగిలేస్తున్నారు. మరోవైపు కాపునేతలు పార్టీని ఒదిలేయాలనే ఆలోచనలో ఉన్నారు. లోకేష్ ఫ్యూచర్ గురించి ఊహించుకోవడానికే పార్టీ వాళ్లకే కష్టంగా ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కాపులందరినీ ఒకే ఛట్రం కింద తీసుకొచ్చినట్టైయితే.. మరో పదెళ్లకు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. ఇదే నా ప్రణాళిక అంటూ కత్తి మహేష్ మూడు ఉచిత సలహాలు ఇచ్చాడు. మరి కత్తి సలహాలను జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలకిస్తాడా లేదా  అనేది చూడాలి.
First published: June 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు