మంచు మనోజ్ మంచితనానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫిదా..

మంచు మనోజ్ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఈయన నటించనంటూ అప్పట్లో ఓ స్టేట్మెంట్ ఇస్తే ఏదో కామెడీగా చెప్తున్నాడేమో అనుకున్నారు కానీ నిజంగానే దాన్ని అమలు చేసాడు మనోజ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 16, 2019, 2:39 PM IST
మంచు మనోజ్ మంచితనానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫిదా..
పవన్ కల్యాణ్ మంచు మనోజ్ ఫైల్ ఫోటోస్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 16, 2019, 2:39 PM IST
మంచు మనోజ్ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఈయన నటించనంటూ అప్పట్లో ఓ స్టేట్మెంట్ ఇస్తే ఏదో కామెడీగా చెప్తున్నాడేమో అనుకున్నారు కానీ నిజంగానే దాన్ని అమలు చేసాడు మనోజ్. ఇప్పుడు ఈయన హాయిగా టూర్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. దాంతో పాటు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు జరుగుతున్న ఇష్యూస్‌పై స్పందన తెలియజేస్తున్నాడు. అంతేకాదు.. ప్రత్యక్షంగా అభిమానులతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాడు.. విషయాలపై చర్చిస్తున్నాడు. దానికితోడు వాళ్ల కష్టాలను కూడా పంచుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు మనోజ్.


తాజాగా పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు తనకు ఎదురైన కష్టాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. సాయినాథ్ కల్యాణ్ అనే కుర్రాడు తను పవన్ కల్యాణ్ అభిమానినని.. జనసేన పార్టీ కోసం తిరిగానని చెప్పుకొచ్చాడు. తనకు పవన్ అంటే ప్రాణమని.. ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని రాసుకొచ్చాడు. ఇక ఇప్పుడు తన తండ్రికి సీరియస్‌గా ఉందని.. కానీ తన దగ్గర వైద్యం చేయించుకునేంత ఆర్థిక స్థోమత లేదని చెప్పుకొచ్చాడు.
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, జేడీ లక్ష్మీనారాయణ, మంచు మనోజ్ లాంటి వాళ్లకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. మనోజ్ చూసి వెంటనే నీ వివరాలు పంపు స్వామి.. మా వాళ్లు నీ దగ్గరికి వచ్చి కలుస్తారు.. ధైర్యంగా ఉండు మీ నాన్నకు ఏం కాదంటూ ధైర్యం చెప్పాడు. మొత్తానికి సోషల్ మీడియాలో కష్టాన్ని చూసి కదిలిపోయాడు మనోజ్. ఈయన మంచి మనసుకు అందరి నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది.
First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...