పవన్ బర్త్‌డే వేడుకల్లో విషాదం.. ఫ్యాన్స్‌కు కరెంట్ షాక్.. ముగ్గురు మృతి..

ఈ ఘటనలో ముగ్గురు పవన్ కల్యాణ్ అభిమానులు మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

news18-telugu
Updated: September 1, 2020, 10:16 PM IST
పవన్ బర్త్‌డే వేడుకల్లో విషాదం.. ఫ్యాన్స్‌కు కరెంట్ షాక్.. ముగ్గురు మృతి..
పవన్ బర్త్‌డే బ్యానర్ కడుతుండగా కరెంట్ షాక్.. ముగ్గురు మృతి..
  • Share this:
రేపు (సెప్టెంబరు 2) జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. తనకు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం ఇష్టం ఉండదని పవన్ చెప్పినప్పటికీ.. ఆయన అభిమానులు మాత్రం సెలబ్రేట్ చేసుకుంటారు. కేకులు కట్ చేసి.. రక్తదానాలు చేసి సందడి చేస్తారు. ఈసారి కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే పవర్‌స్టార్ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకునేందుకు సన్నద్ధమవున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శాంతిపురంలో పవన్ అభిమానులు బర్త్ డే బ్యానర్‌లు కడుతున్న సమయంలో అపశృతి జరిగింది. ఏడవ మైల్ వద్ద ఫ్లెక్సీలు కడుతుండగా ఐదు మంది విద్యుత్ షాక్ తగిలింది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంలో ముగ్గురు పవన్ కల్యాణ్ అభిమానులు మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మృతుల్లో ఇద్దరు అన్నాదమ్ముళ్లు ఉండడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై స్థానిక శాసన సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను, బాధితులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని, ఆర్ధిక సాయం అందించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
Published by: Shiva Kumar Addula
First published: September 1, 2020, 10:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading