PAWAN KALYAN FANS ATTRACTS DAGGUBATI VENKATESH TWEET ON F3 SLB
Venkatesh: అందరూ ఫ్యామిలీతో కలిసి రావాలమ్మా..! వెంకీమామ ట్వీట్‌పై పవన్ ఫ్యాన్స్ రియాక్షన్
Photo Twitter
F3 Movie: వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన F3 మూవీ మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వెంకటేష్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. వెంకీ స్టైల్లో చేసిన ఈ ట్వీట్ చూసి తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్.
వెంకటేష్ (Venkatesh) సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కి అదో పండగ. ఎంచక్కా కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసే స్క్రిప్ట్‌లకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు వెంకీమామ. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు కంప్లీట్ ఫామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు అదే బాటలో F3 మూవీ (F3 Movie) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మే 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు దగ్గుబాటి వెంకటేష్. ఈ మేరకు పలు ఇంటర్వూస్‌లో పాల్గొంటూనే సోషల్ మీడియా వేదికగా తన సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. వెంకీ స్టైల్లో చేసిన ఈ ట్వీట్ చూసి తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్.
ఈ మధ్యకాలంలో హీరోల ఫ్యాన్స్ నడుమ వార్స్ చూస్తున్నాం. ఓ హీరో సినిమా రిలీజ్ అయితే ఇంకో హీరో అభిమానులు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తుండటం లాంటి ఘటనలు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువయ్యాయి. కానీ వెంకటేష్ సినిమా విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఆయన F3 సినిమా కోసం అశేష అభిమాన లోకం ఎంతగానో ఎదురు చూడటమే గాక ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటోంది. తాజాగా 'అందరూ ఫ్యామిలీతో కలిసి రావాలమ్మా..' అంటూ F3 పోస్టర్ పోస్ట్ చేస్తూ వెంకటేష్ చేసిన ట్వీట్‌పై నెటిజన్ల నుంచి పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి.
వెంకీమామ సినిమా కోసం వెయిటింగ్ ఇక్కడ, కచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి వస్తాం, మీ ఆహ్వానానికి థాంక్స్ అంటూ కొంతమంది ట్వీట్స్ చేస్తుండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు చేసిన ట్వీట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ''నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెబుతున్నా. వెంకటేష్ గారు అందరికీ ఇష్టమైన హీరో. వెంకటేష్ గారు నేను మీ సినిమా నా కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఆదివారం చూస్తాను'' అని కామెంట్ పెట్టాడు సదరు నెటిజన్. ఈ కామెంట్స్ చూసి వెంకటేష్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
F3 సినిమాకు నెలకొన్న డిమాండ్‌తో దాదాపు 70 కోట్లమేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వెంకటేష్ (Venkatesh Daggubati), వరుణ్ తేజ్ (Varun tej) హీరోలుగా రాబోతున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో ప్రేక్షకులు ఊహించిన దాన్ని మించి కామెడీ సన్నివేశాలు ఉంటాయని చెబుతున్నారు మేకర్స్.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.