మే 23 త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్లాన్ ఏంటి.. సినిమాలు చేస్తాడా చేయ‌డా..?

ఇప్పుడు ఇదే అనుమానం అందర్లోనూ వస్తుంది. పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఏం చేస్తాడు.. చేయబోతున్నాడు.. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు.. ఎటువైపు అడుగు వేయాలనుకుంటున్నాడు.. ఇలా ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 19, 2019, 5:20 PM IST
మే 23 త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్లాన్ ఏంటి.. సినిమాలు చేస్తాడా చేయ‌డా..?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఇప్పుడు ఇదే అనుమానం అందర్లోనూ వస్తుంది. పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఏం చేస్తాడు.. చేయబోతున్నాడు.. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు.. ఎటువైపు అడుగు వేయాలనుకుంటున్నాడు.. ఇలా ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఫలితాల్లో జనసేన ప్రభావం ఎలా ఉన్నా తాను పోరాడటం ఖాయం అని ఇప్పటికే చెప్పాడు పవర్ స్టార్. గెలిస్తే అసెంబ్లీ లోపల.. ఓడితే అసెంబ్లీ గేట్ బయట పోరాటం చేస్తానంటున్నాడు జనసేనాని. ఇప్పుడున్న లెక్కల ప్రకారం పవన్ కళ్యాణ్ కచ్చితంగా అసెంబ్లీ లోపలే పోరాటం చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

Pawan Kalyan fans are waiting for may 23rd.. Will he do movies after election results pk.. ఇప్పుడు ఇదే అనుమానం అందర్లోనూ వస్తుంది. పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఏం చేస్తాడు.. చేయబోతున్నాడు.. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు.. ఎటువైపు అడుగు వేయాలనుకుంటున్నాడు.. ఇలా ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. lok sabha elections exit poll,lok sabha election results,lok sabha election results 2019,exit poll 2019,janasena,janasena elections results,janasena twitter,janasena party,pawan kalyan janasena twitter,pawan kalyan movies,pawan kalyan politics,janasena seats elections 2019,janaesna party results,pawan kalyan twitter,ap elections 2019,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటో

ఆయన గెలిస్తే ఎమ్మెల్యేగా ఉండి సినిమాలు చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయాలు చేస్తూ సినిమాలు చేస్తాడా.. లేదంటే రాజకీయాల కోసం సినిమాలు వదిలేస్తాడా.. లేదంటే సినిమాలతో పాటే రాజకీయాలు కూడా కంటిన్యూ చేస్తాడా అనేది అసలు సందేహం.అజ్ఞాతవాసి తర్వాత పవన్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. గత ఆర్నెళ్లుగా ఈయనకు మరో పనేదీ లేదు. ఎన్నికల ప్రచారంతో పాటు జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికలు కూడా పూర్తైపోయాయి. పోలింగ్ అయిపోవడంతో మే 23 వరకు మరో పనేదీ లేనట్లే.

Pawan Kalyan fans are waiting for may 23rd.. Will he do movies after election results pk.. ఇప్పుడు ఇదే అనుమానం అందర్లోనూ వస్తుంది. పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఏం చేస్తాడు.. చేయబోతున్నాడు.. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు.. ఎటువైపు అడుగు వేయాలనుకుంటున్నాడు.. ఇలా ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. lok sabha elections exit poll,lok sabha election results,lok sabha election results 2019,exit poll 2019,janasena,janasena elections results,janasena twitter,janasena party,pawan kalyan janasena twitter,pawan kalyan movies,pawan kalyan politics,janasena seats elections 2019,janaesna party results,pawan kalyan twitter,ap elections 2019,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ,తెలుగు సినిమా
పవన్ కల్యాణ్(File)

మే 23 తర్వాత పవన్ ఏం చేస్తాడు.. చెప్పబోతున్నాడు అనేది వినాలని అభిమానులతో పాటు నిర్మాతలు కూడా వేచి చూస్తున్నారు. ఆయనకు కోట్లకు కోట్లు అడ్వాన్సులు ఇచ్చిన వాళ్లు ఇప్పటికీ ఏదో ఓ రోజు మనసు మార్చుకుని ఆయన సినిమా చేయకపోతాడా అని చూస్తున్నారు. అది జరిగేనా అనే అనుమానం ఉన్నా.. తాను సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టలేదు.. పెట్టింది కామా మాత్రమే అని అప్పట్లో పవన్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని ధైర్యంగా ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికిప్పుడు తాను గెలిచేసి ముఖ్యమంత్రి అయిపోవాలని లేదని.. ముందు ప్రజల సమస్యలు తీర్చడమే తన పని అన్నాడు పవర్ స్టార్.

Pawan Kalyan fans are waiting for may 23rd.. Will he do movies after election results pk.. ఇప్పుడు ఇదే అనుమానం అందర్లోనూ వస్తుంది. పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఏం చేస్తాడు.. చేయబోతున్నాడు.. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు.. ఎటువైపు అడుగు వేయాలనుకుంటున్నాడు.. ఇలా ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. lok sabha elections exit poll,lok sabha election results,lok sabha election results 2019,exit poll 2019,janasena,janasena elections results,janasena twitter,janasena party,pawan kalyan janasena twitter,pawan kalyan movies,pawan kalyan politics,janasena seats elections 2019,janaesna party results,pawan kalyan twitter,ap elections 2019,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ,తెలుగు సినిమా
జనసేన ఎన్నికల ప్రచారం

ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత పవన్ ఏం చేస్తాడు.. చేయాలనుకుంటున్నాడనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. నిన్నమొన్నటి వరకు కూడా రాజకీయాలతోనే బిజీగా ఉన్నాడు పవన్. ఇప్పుడు ఉన్నట్లుండి మొత్తం ఖాళీ టైమ్ దొరికేసింది. దాంతో జనసేనాని ప్లాన్ ఏంటో ఎవరికీ క్లారిటీ రావడం లేదు. ఈ కొన్ని రోజులు పూర్తిగా కుటుంబంతో గడపాలని పవన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. దాంతో పాటు పార్టీ సంస్థాగత ఏర్పాట్లలో కూడా పవన్ బిజీ కానున్నాడు. మరోవైపు నాగబాబు కూడా జనసేన పార్టీ కచ్చితంగా గెలుస్తుందని.. తన తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడని చెబుతున్నాడు. అయితే పవన్ సిఎం అయినా కాకపోయినా పోరాడతాడనేది సత్యం. కానీ సినిమాలు చేస్తాడా చేయడా అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్.
Pawan Kalyan fans are waiting for may 23rd.. Will he do movies after election results pk.. ఇప్పుడు ఇదే అనుమానం అందర్లోనూ వస్తుంది. పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఏం చేస్తాడు.. చేయబోతున్నాడు.. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు.. ఎటువైపు అడుగు వేయాలనుకుంటున్నాడు.. ఇలా ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. lok sabha elections exit poll,lok sabha election results,lok sabha election results 2019,exit poll 2019,janasena,janasena elections results,janasena twitter,janasena party,pawan kalyan janasena twitter,pawan kalyan movies,pawan kalyan politics,janasena seats elections 2019,janaesna party results,pawan kalyan twitter,ap elections 2019,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్ (Image : Twitter)

మే 23 తర్వాత దీనిపై మరింత క్లారిటీ రానుంది. అసలు పవన్ మనసులో ఏముంది అని తెలుసుకోవడం చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆయన ఏ విషయాన్ని కూడా చివరి వరకు చెప్పడు. ఇప్పుడు కూడా ఇదే సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నాడు. పవన్ ఏ కోశాన అయినా సినిమాలు చేసే ఉద్ధేశ్యం ఉంటే ఆయన్ని రంగంలోకి దించాలని కొందరు నిర్మాతలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రేపు పొద్దున్న జనసేన అద్భుతం చేస్తే ఓకే కానీ లేదంటే పవన్ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండబోతుందనేది మాత్రం ఆసక్తికరమే. దీనికి సమాధానం తెలియాలంటే మే 23 అనే డెడ్ లైన్ దాటాల్సిందే.
Published by: Praveen Kumar Vadla
First published: May 19, 2019, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading