• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN FANS ARE IN FOR A TREAT AS VAKEEL SAAB RELEASE DATE IS FIXED MHN

Pawan Kalyan - Vakeel Saab: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే టైమ్ వచ్చింది... ‘వకీల్ సాబ్‘ రిలీజ్ డేట్ ఫిక్స్

Pawan Kalyan - Vakeel Saab: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే టైమ్ వచ్చింది... ‘వకీల్ సాబ్‘ రిలీజ్ డేట్ ఫిక్స్

Pawan Kalyan fans are in for a treat as Vakeel Saab release date is fixed

Pawan Kalyan - Vakeel Saab: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ ఖరారైంది. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ ఫ్యాన్స్ ఖుషీ చేసుకునే టైమొచ్చింది

  • Share this:
    ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానులు పండ‌గ చేసుకునే టైం వ‌చ్చింది. ఎందుకంటే.. దాదాపు రెండేళ్ల త‌ర్వాత వారి అభిమాన హీరోను వెండితెర‌పై చూసుకుని సంబ‌ర‌ప‌డే స‌మ‌యం వ‌చ్చింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాత్ర‌కు సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు మాత్ర‌మే మిగిలిఉన్నాయి. ముందుగా ‘వ‌కీల్‌సాబ్‌’ సంక్రాంతికి వ‌స్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ... అలా జ‌ర‌గ‌డం లేదు. మ‌రి థియేట‌ర్స్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ సంద‌డి ఎప్పుడు ఉంటుంది? అని స‌గ‌టు అభిమానికి వ‌చ్చిన సందేహం. లేటెస్ట్ pస‌మాచారం మేర‌కు ‘వ‌కీల్‌సాబ్’ విడుద‌లపై ఇప్ప‌టికే నిర్మాత‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ట‌. ఏప్రిల్ 9న ‘వ‌కీల్‌సాబ్’ సంద‌డి థియేట‌ర్స్‌లో ఉంటుంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల‌కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న‌ను నిర్మాత‌లు ప్ర‌క‌టిస్తారు.

    ప‌‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల్లోకి వెళుతున్నానని ప్ర‌క‌టించ‌గానే ఇక ఆయ‌న్ని వెండితెర‌పై చూడ‌లేమోన‌ని ఆయ‌న అభిమానులు పెద్ద బాధ‌ప‌డిపోయారు. అయితే రాజకీయాల్లో స‌క్సెస్ కాక‌పోవ‌డం.. త‌దుప‌రి ఎన్నిక‌ల‌కు స‌మయం ప‌ట్టేలా ఉండ‌టంతో ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌స్తూనే ఒకటి కాదు.. రెండు కాదు. ఏకంగా ఐదు సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి అంద‌రికీ షాకిచ్చాడు. అందులో ముందుగా వకీల్ సాబ్‌ను ముందుగా ప‌వ‌న్ సెట్స్‌పై తీసుకెళ్లాడు.

    బాలీవుడ్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘పింక్‌’ సినిమాకు ఇది రీమేక్‌. ఇందులో ప‌వ‌న్‌క‌ల్యాణ్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న లాయ‌ర్ లుక్‌కి కూడా మంచి స్పంద‌న వ‌చ్చింది. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో అంజ‌లి, నివేదా థామ‌స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు