పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ను ఆ విధంగా భయపెడుతున్న హరీష్ శంకర్..

సెకండ్ ఇన్నింగ్స్‌లో  పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాను చేస్తున్నాడు. దాంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. ఈ సినిమా విషయంలో అభిమానులకు సెంటిమెంట్ గుర్తుకు వచ్చిన ఒకటే ఆందోళన పడుతున్నారు.

news18-telugu
Updated: May 29, 2020, 1:07 PM IST
పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ను ఆ విధంగా భయపెడుతున్న హరీష్ శంకర్..
మరోవైపు హరీష్ శంకర్ సినిమా కూడా ఇప్పుడు అనుకున్న దానికంటే ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పవన్ కోసం విడిపోయిన ఓ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ కలవబోతుంది. వాళ్లే సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ.
  • Share this:
సెకండ్ ఇన్నింగ్స్‌లో  పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాను చేస్తున్నాడు. లాక్‌డౌన్ తర్వాత వచ్చే నెల 15 తర్వాత ఈ సినిమా మిగిలిన షూటింగ్ పార్ట్‌ను పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయనున్నాడు. ఆ సినిమా తర్వాత క్రిష్‌తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయనున్నాడు. జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ టైటిల్‌ అనుకుంటున్నారు. క్రిష్ సినిమా తర్వాత హరీష్ శంకర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా ఉండనుంది.  హరీష్ శంకర్‌తో సినిమా అనగానే ముందుగా సంతోష పడ్డ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇపుడు సెంటిమెంట్ గుర్తుకు వచ్చి ఒకటే టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌తో ఒక సినిమా హిట్టు ఇచ్చిన డైరెక్టర్..  మరోసారి పవన్ కళ్యాణ్‌కు సక్సెస్ ఇచ్చిన దాఖలాలు లేవు.  పవన్ కళ్యాణ్‌తో ‘సుస్వాగతం’ వంటి హిట్ సినిమా ఇచ్చిన భీమనేని శ్రీనివాస రావు .. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో‘అన్నవరం’ సినిమా చేసాడు.ఈ  సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.ఇక పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా ‘తొలిప్రేమ’ అనే చెప్పాలి. ఈ చిత్రంతోనే పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన కరుణాకరన్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో ‘బాలు’ అనే  సినిమా చేసాడు. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. అటు పవన్ కళ్యాణ్‌తో ‘బద్రి’ వంటి హిట్ సినిమా ఇచ్చిన పూరీ జగన్నాథ్.. ఆ తర్వాత ‘కెమెరా గంగతో రాంబాబు’ అంటూ ప్లాప్ ఇచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్‌తో ‘ఖుషీ’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్.జె.సూర్య.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో ‘కొమరం పులి’ వంటి దారుణమైన డిజాస్టర్ ఇచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్‌తో ‘గోపాల గోపాల’ వంటి సినిమాను తెరకెక్కించిన కిషోర్ పార్థసాని య(డాలీ).. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించిన ‘కాటమరాయడు’ సినిమాతో డిజాస్టర్ ఇచ్చాడు.

pawan kalyan fans afraid for harish shankar second sentiment here are the details,Pawan kalyan,harish shankar,pawan kalyan harish shankar second sentiment,harish shankar second sentiment,pawan kalyan twitter,harish shankar twitter,harish shnakar controversy,bandla ganesh,bandla ganesh twitter,gabbar singh,gabbar singh movie,gabbar singh movie twitter,8 years for gabbar singh,pawan kalyan,pawan kalyan gabbar singh 8 years,gabbar singh movie records,gabbar singh movie collections,8 years of gabbar singh history,telugu cinema,pawan kalyan shruti haasan,గబ్బర్ సింగ్,పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌కు 8 ఏళ్లు,పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ గబ్బర్ సింగ్,హరీష్ శంకర్ సెంటిమెంట్,సెంటిమెంట్ బ్రేక్ చేస్తున్న హరీష్ శంకర్
కాటమ రాయుడులో పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


తాజాగా పవన్ కళ్యాణ్‌తో ఎనిమిదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ వంటి హిట్ చిత్రాన్ని ఇచ్చిన హరీష్ శంకర్ ఇపుడు మరో చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇది చూసి పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు సెంటిమెంట్ గుర్తుకు వచ్చిన ఒకటే టెన్షన్ పడుతున్నారు. ఈ చిత్రానికి ‘ఇపుడే మొదలైంది’ అనే టైటిల్ అనుకుంటున్నారు. మరి వారి అనుమానులను పటాపంచలు చేస్తూ దర్శకుడు హరీష్ శంకర్..పవన్ కళ్యాణ్‌కు హిట్టు సినిమా ఇచ్చి సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 29, 2020, 1:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading