సుడిగాలి సుధీర్‌, యాంకర్ ప్రదీప్‌తో ఆడుకున్న రేణు దేశాయ్..

రేణు దేశాయ్ తెలుగు తెరపై మళ్లీ మెరుస్తుంది. ఒకప్పుడు పవన్ కల్యాణ్ సినిమాల్లో మాత్రమే కనిపించిన రేణు.. ఆ తర్వాత ఆయన్నే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 26, 2019, 10:12 PM IST
సుడిగాలి సుధీర్‌, యాంకర్ ప్రదీప్‌తో ఆడుకున్న రేణు దేశాయ్..
రేణు దేశాయ్ ఫైల్ ఫోటో (Source: Youtube)
  • Share this:
రేణు దేశాయ్ తెలుగు తెరపై మళ్లీ మెరుస్తుంది. ఒకప్పుడు పవన్ కల్యాణ్ సినిమాల్లో మాత్రమే కనిపించిన రేణు.. ఆ తర్వాత ఆయన్నే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. నటనకు మాత్రమే దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. బుల్లితెరపై తనదైన శైలిలో సత్తా చూపిస్తుంది. కొన్ని కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా మారిపోతుంది రేణు దేశాయ్. ఇప్పుడు కూడా ఢీ ఛాంపియన్స్ డాన్స్ షోకు కొత్త జడ్జిగా వచ్చింది రేణు. తాజాగా విడుదలైన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఫాలోయర్స్ అయిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ముఖ్యంగా వచ్చిన వెంటనే రేణు కూడా తనదైన పంచ్ డైలాగులతో పిచ్చెక్కించింది. సుడిగాలి సుధీర్‌తో ఆడుకుంది ఈ భామ. ముందు నుంచి కూడా అన్ని ఎపిసోడ్స్ చూస్తూ వస్తున్నానని.. డాన్స్ షో అదిరిపోతుందని చెప్పింది రేణు దేశాయ్. ఇక సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోతుందని చెప్పింది రేణు. దానికితోడు శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్‌పై కూడా ప్రశంసల వర్షం కురిపించింది. గత వారం వరకు పూర్ణ ఉన్న స్థానంలో ఇప్పుడు రేణు వచ్చింది. మొత్తానికి పవన్ మాజీ భార్య రాకతో ఢీ ఛాంపియన్స్‌కు కొత్త కళ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Published by: Praveen Kumar Vadla
First published: September 26, 2019, 10:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading