Renu Desai-Suma: సుమ రియల్ రాక్ స్టార్ అంటూ రేణు దేశాయ్ ప్రశంసలు..

రేణు దేశాయ్, సుమ కనకాల (Instagram/Photo)

Renu Desai-Suma | తెలుగులో తనదైన మాటకారితనంతో దాదాపు రెండు దశాబ్ధాలుగా యాంకర్‌గా దూసుకుపోతుంది. ఇక రేణు దేశాయ్ విషయానికొస్తే.. ఈమె పవన్ కళ్యాన్ మాజీ భార్యగా.. దర్శకులుగా అందరికీ సుపరిచితమే. తాజాగా వీళ్లిద్దరు కలిసి దిగిన ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Share this:
    Renu Desai-Suma | తెలుగులో తనదైన మాటకారితనంతో దాదాపు రెండు దశాబ్ధాలుగా యాంకర్‌గా దూసుకుపోతుంది. జన్మత: మలయాళీ అయిన తెలుగింటి కోడలుగా తనదైన యాంకరింగ్‌తో మైమరిపిస్తోంది. ఎంత పెద్ద షో అయినా.. ఆడియో ఫంక్షన్ అయినా సుమ ఉంటే ఆ కిక్కే వేరు. అంతలా తన మాటలతో ప్రేక్షకులను మైమరిపిస్తోంది. సుమ కనకాల ముందు వెనకలా ఎంత మంది యాంకర్స్ వచ్చినా.. ఇప్పటి తెలుగులో యాంకర్‌గా ఆమె స్థానం పదిలంగా ఉంది. ఇక రేణు దేశాయ్ విషయానికొస్తే.. ఈమె పవన్ కళ్యాన్ మాజీ భార్యగా.. దర్శకులుగా అందరికీ సుపరిచితమే. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటోంది. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన రేణు దేశాయ్..ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయమై సెలెంట్ అయిపోయింది. ఆ మధ్య మరాఠిలో తన కొడుకు అకిరానందన్ ముఖ్యపాత్రలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది రేణు దేశాయ్. మధ్యలో రేణు దేశాయ్.. ఓ టీవీ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత రేణు దేశాయ్.. సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ రేణు దేశాయ్.. వేటికి యస్ చెప్పలేదు. తాజాగా రేణు దేశాయ్.. తాను నటిగా ఓ వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ వెబ్ సిరీస్‌లో సుమ కనకాల కూడా నటిస్తోంది.








    View this post on Instagram






    A post shared by renu desai (@renuudesai)





    ఈ సందర్భంగా సుమతో రేణు దేశాయ్ దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సుమతో నా ఫస్ట్ ఫోటో.. సుమ నిజమైన రాక్ స్టార్ నువ్వే . నిన్న సుమతో  నా షూటింగ్ బాగా జరిగిందంటూ రేణు దేశాయ్  చెప్పుకొచ్చింది. మొత్తంగా రేణు దేశాయ్, సుమ కలిసి ఉన్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: