ప్రముఖ నటి, పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ అనారోగ్యం పాలయ్యారు. డెంగీ బారిన పడినట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దోమలతో జాగ్రత్తగా ఉండాలని తన అభిమానులకు తెలిపారు. అంతేకాకుండా ఇంటి పరిసర ప్రాంతాల్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్నా... కొన్ని గంటల పాటు షూటింగ్ ఉండటంతో కాదనలేకపోయానని తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో రేణు దేశాయ్ పోస్టు చేశారు. డెంగీ నుంచి జగ్రత్తగా ఉండాలన్నారు. దోమలు కుట్టకుండా పొడవైన దుస్తుల్ని ధరించాలని ఆమె తెలిపారు. ప్రస్తుతం రేణు సినిమాలకు దూరంగా ఉంటూ.. టీవీల్లో వచ్చే రియాల్టీ షోలలో పాల్గొంటున్నారు.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా విష జ్వరాలు కబళిస్తున్నారు. ఎక్కడ చూసినా డెంగీ పేరే వినిపిస్తోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ దగ్గర రోగులు చికిత్స కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ప్రభుత్వాసుపత్రుల్లో ఒకే పడకపై ఇద్దరు రోగులకు, నిలోఫర్లాంటి పిల్లల ఆస్పత్రుల్లో ఒకే బెడ్‌పై ముగ్గురు చిన్నారులను పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. ఇటు టు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు కూడా పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఎక్కడా కూడా మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dengue fever, Hyderabad, Pawan kalyan, Renu Desai, Telangana