మహేష్ బాబు సినిమాలో రేణు దేశాయ్.. కోరిక తీరినట్లే..

Renu Desai Mahesh Babu: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చాలా కాలంగా సరైన కథ దొరికితే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. అయితే కథ సరిగ్గా లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆగింది ఈమె.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 25, 2020, 4:09 PM IST
మహేష్ బాబు సినిమాలో రేణు దేశాయ్.. కోరిక తీరినట్లే..
మహేష్ బాబు రేణు దేశాయ్ (mahesh babu renu desai)
  • Share this:
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చాలా కాలంగా సరైన కథ దొరికితే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. అయితే కథ సరిగ్గా లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆగింది ఈమె. ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో నటిస్తుందనే వార్తలు వచ్చినా.. ఇప్పుడు ఆ సినిమా తెరకెక్కడం కూడా అనుమానంగా మారింది. దాంతో ఆమె రీ ఎంట్రీ మళ్లీ అక్కడే ఆగిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కూడా ఈమె నటిస్తుందనే వార్తలొచ్చినా అవి కూడా అబద్ధాలే అని తేలిపోయాయి. ఇలాంటి సమయంలో సరైన కథ కోసం చూస్తుంది రేణు దేశాయ్.
మహేష్ బాబు రేణు దేశాయ్ (mahesh babu renu desai)
మహేష్ బాబు రేణు దేశాయ్ (mahesh babu renu desai)


కొన్ని రోజుల కింద బద్రి సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఆ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాధ్‌తో మాట్లాడుతూ తను నటించడానికి సిద్ధంగా ఉన్నానని.. అవకాశం కావాలంటూ కోరింది. అంతేకాదు తనకు మహేష్ బాబు సినిమాలో నటించాలని ఉందని కూడా చెప్పింది. ఇప్పుడు ఈమెకు అవకాశం వచ్చినట్లు కనిపిస్తుంది. అయితే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మాత్రం కాదు.. ఆయన నిర్మిస్తున్న సినిమాలో రేణు నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. అడివి శేష్ హీరోగా మేజర్ అనే సినిమా నిర్మిస్తున్నాడు సూపర్ స్టార్. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
అడవి శేష్ మేజర్ సినిమా (adivi sesh major movie)
అడవి శేష్ మేజర్ సినిమా (adivi sesh major movie)

క్షణం, గూఢాచారి, ఎవరు లాంటి వరస విజయాలతో దూసుకుపోతున్న అడవి శేష్.. ఈ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే మేజర్ సినిమా సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఆమె పాత్ర ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తెలుగులో ఇప్పటి వరకు పవన్ సరసన జానీ, బద్రి సినిమాలు మాత్రమే చేసింది రేణు. ఆ తర్వాత నటనకు దూరమైంది. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత వెండితెరపై కనిపించబోతుంది రేణు దేశాయ్.
First published: June 25, 2020, 4:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading