రేణు దేశాయ్ ఫ్యూచర్ ప్లాన్.. పిల్లలు కాలేజీకి వెళ్లిన తర్వాత..

Renu Desai: బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత జానీ సినిమాలో పవన్‌తోనే మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుని మన ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ రేణు దేశాయ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 28, 2020, 8:35 PM IST
రేణు దేశాయ్ ఫ్యూచర్ ప్లాన్.. పిల్లలు కాలేజీకి వెళ్లిన తర్వాత..
ఆద్య, అకిరాతో రేణుదేశాయ్ (Image: Instagram)
  • Share this:
బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత జానీ సినిమాలో పవన్‌తోనే మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుని మన ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ రేణు దేశాయ్. జానీ తర్వాత పవన్‌తోనే ప్రేమలో పడి ఏడేళ్ల సహజీవనం తర్వాత పెళ్లి చేసుకుంది ఈమె. ఆ తర్వాత రెండేళ్లకే ఆయనతో విడిపోయి.. పిల్లల ఆలన పాలన చూసుకుంటుంది. కొన్నేళ్లుగా పిల్లలతో సహా పూణేలో ఉంటున్న రేణు దేశాయ్.. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ వచ్చి పోతూ ఉంది. ఈ క్రమంలోనే ఈమె వికారాబాద్‌లోని ఓ గ్రామంలో చిన్నపిల్లలతో సరదాగా ఆడుకుంటున్న ఓ వీడియోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది.
రేణు దేశాయ్ ఫోటో (Renu desai Instagram)
రేణు దేశాయ్ ఫోటో (Renu desai Instagram)


ఇది చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. అందులో చాలా మంది చిన్న పిల్లలతో పాటు ఆవులు, మేకలు, కాకులు, కొంగల వీడియోలను కూడా పోస్ట్ చేసింది. అచ్చంగా పల్లెటూరి జీవితం ఎలా ఉంటుందో అలా చూపించింది రేణు. ఈమె కేవలం నటి మాత్రమే కాదు.. దర్శకురాలు, రైటర్, కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. దాంతో పాటు మంచి ఫోటోగ్రఫర్ కూడా. అందుకే తన సోషల్ మీడియా పేజీలో అద్భుతమైన ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. తన పిల్లలు కాలేజీలో చేరిన తర్వాత మిగిలిన శేష జీవితాన్ని కూరగాయలు పండిస్తూ హాయిగా ఇలా ఓ గ్రామంలో గడపాలని బలంగా కోరుకుంటున్నానని చెప్పింది రేణు దేశాయ్.

ఓ పది పిల్లులు.. 10 కుక్కలు.. మూగ జీవాలు, లెక్కలేనన్ని పుస్తకాలు ఇవి ఉంటే ఇంక వేరేవాటితో పనేముంది.. అదే నాకు స్వర్గంతో సమానం అంటుంది రేణు. ఈమె వేదాంతం చూస్తుంటే నిజంగానే అలాగే చేసేలా కనిపిస్తుంది. ఆ రోజు త్వరలోనే వస్తుందని కూడా చెబుతుంది రేణు. మొత్తానికి ఇలా వీడియో పోస్ట్ చేసిన తర్వాత కరోనా బాగా వ్యాప్తి చెందుతుండటంతో బయట తిరగొద్దు అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్‌కి బదులిస్తూ.. ఇవి గతంలో చేసిన వీడియోలు.. డేట్ చూసి కామెంట్ పెట్టాలంటూ సెటైర్ వేసింది.
First published: March 28, 2020, 8:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading