కూతురు ఆద్య తీసిన ఫొటోపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Renu Desai : కూతురు ఆద్య తీసిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రేణు దేశాయ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

news18-telugu
Updated: February 20, 2020, 9:55 AM IST
కూతురు ఆద్య తీసిన ఫొటోపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
కూతురు ఆద్యతో రేణు దేశాయ్ Photo: Instagram (File)
  • Share this:
రేణు దేశాయ్.. పవన్ కల్యాన్ మాజీ భార్య. భర్తతో విడాకులు తీసుకొని కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్యతో కలిసి ఉంటున్న ఈమె సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. వ్యక్తిగత, సామాజిక అంశాలపై స్పందిస్తూ అభిమానులను అందుబాటులో ఉంటారు. అకీరా, ఆద్యతో జరుపుకునే సెలబ్రేషన్స్‌ ఫొటోలు, వీడియోలను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా, కూతురు ఆద్య తీసిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రేణు దేశాయ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శ్రీలంక వెకేషన్‌లో ఉన్న రేణు దేశాయ్ రూమ్‌లోని ఓ కుర్చీలో కూర్చొని సముద్రం వైపు చూస్తున్నపుడు ఆద్య తన ఫోన్‌తో ఫొటో తీసింది. ఆ ఫొటోలో రేణు దేశాయ్ ప్రతిబింబం కూడా పడింది. నిజమైన ఫొటోలో ఆనందంగా ఉన్నట్లు, ప్రతిబింబంలో విచారంగా ఉన్నట్లు కనిపించింది.

ఇదే విషయాన్ని రేణు దేశాయ్ ప్రస్తావిస్తూ.. ఒక ఫొటోలో విచారంగా ఉన్నట్లు, ఒక దాంట్లో ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. కెమెరా మన శరీరాన్నే కాదు.. మన నిజమైన ఆలోచనలను కూడా క్యాప్చర్ చేస్తుందని తెలిపారు. దీంతో రేణు దేశాయ్ ఎందుకు విచారంగా ఉన్నారంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

First published: February 20, 2020, 9:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading