Home /News /movies /

PAWAN KALYAN EX WIFE RENU DESAI AND HIS SON AKIRA NANDAN TESTED COVID POSITIVE TA

Renu Desai - Akira Nandan : రేణు దేశాయ్ ఇంట్లో కరోనా కలకలం.. కోవిడ్ బారిన పడ్డ అకిరా నందన్..

రేణు దేశాయ్, అకిరానందన్‌కు కరోనా పాజిటివ్ (Twitter/Photo)

రేణు దేశాయ్, అకిరానందన్‌కు కరోనా పాజిటివ్ (Twitter/Photo)

Renu Desai - Akira Nandan Tested Covid -19 | కరోనా ఫస్ట్ వేవ్, సెకండ వేవ్ దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్ర ఇబ్బందల పాలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా పవన్ కళ్యాణ్..మాజీ భార్య రేణు దేశాయ్.. తనయుడు అకిరానందన్ కోవిడ్ బారిన పడ్డారు.

    Renu Desai - Akira Nandan Tested Covid -19 | కరోనా ఫస్ట్ వేవ్, సెకండ వేవ్ దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్ర ఇబ్బందల పాలు చేసిన సంగతి తెలిసిందే కదా. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో చాలా మంది అసువులు బాసిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా.. ఓమైక్రాన్ రూపంలో విజృంభిస్తోంది. కరోనా (Corona) థర్డ్ వేవ్‌లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ కోవలో మహేష్ బాబు, తమన్, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, త్రిష, వరలక్ష్మి శరత్ కుమార్,  సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూతో పాటు శోభన సహా ఎంతో మంది సినీ ప్రముఖులు  కరోనా బారిన పడ్డారు. ఈ కోవలోనే రేణు దేశాయ్‌తో పాటు ఆమె తనయుడు అకిరా నందన్ కోవిడ్ బారిన పడ్డట్టు సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు.

    ఐతే..  కొన్ని రోజులు క్రితమే తాము కోవిడ్ బారిన పడ్డామని చెప్పారు. ఇపుడిపుడే కోనా నుంచి కోలుకుంటున్నట్టు తెలియజేసారు. ఇప్పటికే తాను. రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు తెలిపారు. ఇక తనయుడు అకిరా నందన్‌కు వ్యాక్సిన్ వేయించేలోపు.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ సందర్భంగా ప్రజలందరూ.. జాగ్రత్తగా ఉండాలని రేణు దేశాయ్  కోరారు.








    View this post on Instagram






    A post shared by renu (@renuudesai)





    రేణు దేశాయ్ విషయానికొస్తే.. ఒక నటి కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలు అకిరానందన్, ఆద్యాతో  కలిసి పూణెలో ఉంటోంది. రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్‌తో నేరుగా కలవకపోయినా.. తన పిల్లలను పవన్ కళ్యాణ్‌‌కు మాత్రం దూరం చేయలేదు. గత కొన్నేళ్లుగా మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతి ఫంక్షన్‌లో వీళ్లు పవన్ కళ్యాణ్‌తో కలిసి సందడి చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన రేణు దేశాయ్..ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయమై సెలెంట్ అయిపోయింది.ఆ మధ్య మరాఠిలో తన కొడుకు అకిరానందన్ ముఖ్యపాత్రలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది రేణు దేశాయ్.

    Kushboo - Shobhana Corona Positive : కరోనా బారిన పడ్డ సీనియర్ హీరోయిన్స్ కుష్బూ, శోభన.. సినీ ఇండస్ట్రీలో కరోనా కల్లోలం..


    మధ్యలో రేణు దేశాయ్.. ఓ టీవీ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత రేణు దేశాయ్.. సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ రేణు దేశాయ్.. వేటికి యస్ చెప్పలేదు. కానీ  రేణు దేశాయ్.. తాను నటిగా ఓ వెబ్ సిరీస్‌తో  రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akira nandan, Covid -19 pandemic, Pawan kalyan, Renu Desai, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు