Home /News /movies /

PAWAN KALYAN DOUBLE TREAT FOR HIS FANS ON EVE OF HIS BIRTHDAY TA

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అభిమానులకు పవర్ స్టార్ డబుల్ ట్రీట్..

పవన్ కళ్యాణ్ (File/Photo)

పవన్ కళ్యాణ్ (File/Photo)

పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కోసం డబుల్ ట్రీట్ రెడీ చేస్తున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్..

    పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కోసం డబుల్ ట్రీట్ రెడీ చేస్తున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ .. ఒకేసారి మూడు సినిమాలకు ఓకే చెప్పాడు. అందులో రెండు సినిమాలు పట్టాలెక్కాయి కూడా. ఈ క్రమంలో ఈ క్రమంలోనే శ్రీరామ్ వేణు దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమాను ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. తెలుగులో పవన్ కళ్యాన్ ఇమేజ్‌కు తగ్గట్టు కమర్షియల్‌గా కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్‌,అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌ విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు, హీరోయిన్‌తో కొన్ని సీన్స్ మాత్రమే బాకీ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

    వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ (Twitter/Photo)c
    వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ (Twitter/Photo)c


    ఇప్పటికే తెలంగాణ., ఏపీ  ప్రభుత్వాలు షూటింగ్స్‌కు పర్మిషన్స్ ఇవ్వడంతో వచ్చే నెల నుంచి  ఈ సినిమాలో మిగిలిన పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ ఫినిష్ చేయనున్నారు.  ఈ సినిమా తర్వాత జూలై నుంచి క్రిష్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను పవన్ కళ్యాణ్‌ను స్టార్ట్ చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను క్రిష్ స్టార్ట్ చేసాడు. పవన్ కళ్యాణ్‌తో రెండు మూడు సీన్స్ కూడా చిత్రీకరించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లేని సీన్స్‌ను డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ అనే పేరుతో పాటు  ‘బందిపోటు’ ’గజ దొంగ’ అనే పేర్లను పరిశీలిస్తున్నారు.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేయనున్నారు.

    పవన్ కళ్యాణ్ (twitter/Pawan Kalyan)
    పవన్ కళ్యాణ్,క్రిష్ (twitter/Pawan Kalyan)


    క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న  ఈ సినిమా  కోహినూర్ వజ్రం నేపథ్యంలో తెరకెక్కుతోందనే  ప్రచారం జరుగుతోంది. ఈ  సినిమాను ముందుగా నిర్ణయించిన ప్రకారం విదేశాల్లో చిత్రీకరించాలన్నారు. ప్రస్తుతం కోవిడ్ 19 ఎఫెక్ట్ కారణంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఈ  సినిమాను సెప్టెంబర్‌లో మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి కంప్లీట్ చేయనున్నట్టు సమాచారం. ఒక్కసారి క్రిష్ రంగంలోకి దిగాడంటే షూటింగ్ కంప్లీట్ చేయడం అంత పెద్ద విషయమేమి కాదు. క్రిష్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్... హరీష్ శంకర్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Dil raju, Krish, Pawan kalyan, Sriram Venu, Tollywood, Vakeel Saab

    తదుపరి వార్తలు