Home /News /movies /

PAWAN KALYAN DAILS VARUN TEJ AND APPRECIATED ABOUT HIS MAKEOVER AND TELANGANA ACCENT BA

Valmiki | వరుణ్ తేజ్‌కు పవన్ కళ్యాణ్ ఫోన్

పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్

పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్

వాల్మీకి సినిమాతో కలపి 9 సినిమాల్లో నటించానన్న వరుణ్ తేజ్.. అందులో కొన్ని ప్రయోగాలు, మరికొన్ని ప్రేమకథలు ఉన్నాయని చెప్పాడు.

    వాల్మీకి సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని హీరో వరుణ్ తేజ్ బయటపెట్టాడు. ఈ రోజు వాల్మీకి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. విక్టరీ వెంకటేష్ ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. తనతో పాటు ఎఫ్ 2లో నటించిన వరుణ్ తేజ్.. ఈ రేంజ్‌లో మారిపోతాడని ఊహించలేదంటూ వరుణ్ గెటప్ మీద ప్రశంసలు గుప్పించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌కు గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన హరీశ్ శంకర్... వరుణ్ తేజ్‌కు కూడా బంపర్ హిట్ ఇస్తాడని చెప్పారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ మాట్లాడుతూ... ‘ఈ సినిమా ట్రైలర్ చూడగానే పవన్ కళ్యాణ్ బాబాయ్ ఫోన్ చేశారు. ట్రైలర్ చాలా బాగుందన్నారు. నన్ను, హరీశ్ శంకర్‌ని బాగా మెచ్చుకున్నారు. తెలంగాణ యాస బాగా మాట్లాడావని అభినందించారు.’ అని తెలిపాడు.

    వాల్మీకి సినిమాతో కలపి 9 సినిమాల్లో నటించానన్న వరుణ్ తేజ్.. అందులో కొన్ని ప్రయోగాలు, మరికొన్ని ప్రేమకథలు ఉన్నాయని చెప్పాడు. అయితే, మొట్టమొదటిసారి మాస్ సినిమా చేయడంలో ఆ కిక్కే వేరుగా ఉందన్నారు. తాము ఎందుకు మాస్ సినిమాలో చేస్తామో, అందులో ఉన్న కిక్ ఏంటో అప్పుడప్పుడు చిరంజీవి చెబుతుంటే ఏంటో అనుకున్నానని.. నిజంగా ఆ కిక్కే వేరని ఇప్పుడు తనకు స్వయంగా అనుభవంలోకి వచ్చిందన్నాడు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Harish Shankar, Mega Family, Pawan kalyan, Tollywood Movie News, Valmiki, Varun Tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు