ట్విట్టర్ ట్రెండింగ్‌లో పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు..

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టినా.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న అతికొద్ది మంది నటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. తాజాగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో మరో రికార్డు క్రియేట్ చేసాడు.

news18-telugu
Updated: July 15, 2020, 3:25 PM IST
ట్విట్టర్ ట్రెండింగ్‌లో పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు..
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టినా.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న అతికొద్ది మంది నటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. అంతేకాదు సినిమా రంగంలో పవర్ స్టార్‌గా ఎదిగాడు. అంతేకాదు అన్నయ్య చిరంజీవి లాగే రాజకీయాల్లో అడుగుపెట్టి జనసేన పార్టీ స్థాపించి పాలిటిక్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొన్నటి వరకు ఎన్నికల హడావుడి దృష్ట్యా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇపుడు మళ్లీ సినిమాల వైపు దృష్టి సారించారు. ఈ కోవలోనే హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను ‘వకీల్ సాబ్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. అంతేకాదు క్రిష్, హరీష్ శంకర్‌‌తో పాటు పలువురు దర్శకులతో సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. దానికి నెలన్నరకు పైగా సమయం ఉంది. ఈ లోగా పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఇప్పటి నుంచే సందడి చేయడం మొదలు పెట్టారు. హ్యాపీ బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్విట్టర్‌లో ట్రెండ్ చేసారు. కేవలం 24 గంటల్లోనే 27.3 మిలియన్ ట్వీట్స్ వచ్చాయంటే పవన్ కళ్యాణ్ ఏ రేంజ్‌లో చెలరేగిపోయారో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 15, 2020, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading