• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN CORONA POSITIVE MAHESH BABU TWEET ON PAWAN KALYAN VERY SPEEDY RECOVERY TA

Pawan Kalyan - Mahesh Babu: పవన్ కళ్యాణ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి... మహేష్ బాబు ట్వీట్..

Pawan Kalyan - Mahesh Babu: పవన్ కళ్యాణ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి... మహేష్ బాబు ట్వీట్..

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు (Twitter/Photo)

Pawan Kalyan - Mahesh Babu: పవన్ కళ్యాణ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి అంటూ మహేష్ బాబు సామాజిక మాధ్యమాల వేదికగా ట్వీట్ చేసారు.

  • Share this:
    Pawan Kalyan - Mahesh Babu: పవన్ కళ్యాణ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి అంటూ మహేష్ బాబు సామాజిక మాధ్యమాల వేదికగా ట్వీట్ చేసారు. మన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త నెల రోజుల్లో  దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్ర‌మంలో షూటింగ్‌ల‌లో పాల్గొంటున్న సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటులు కరోనా బారిన పడ్డారు. దీంతో ముందు షెడ్యూల్ చేసుకున్న షూటింగ్‌లు క్యాన్సిల్ కావడంతో నిర్మాతలపై పెను భారం పడుతోంది. మరోవైపు ‘వకీల్ సాబ్’ పవన్ కళ్యాణ్‌ కూడా  కరోనా బారిన పడ్డారు. దీంతో డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.

    పవన్ కళ్యాణ్‌కు కరోనా సోకడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ కోవలో సూపర్ స్టార్ మహేష్ బాబు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేసారు.మరోవైపు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు, దర్శకులతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన కరోనా నుంచి కోలుకోవాంటూ ట్వీట్స్ చేస్తున్నారు.


    అంతేకాదు ఎప్పటిలాగే సినిమాలతో ప్రేక్షకులను అలరించాలంటూ ట్వీట్ చేసారు. తాజాగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఆ మధ్య ‘వకీల్ సాబ్’ సినిమా చూసి మహేష్ బాబు  అభినందించిన సంగతి తెలిసిందే కదా.

    Pawan Kalyan - Mahesh Babu Follows Power Star Pawan Kalyan In this Way Hari Hara Veeramallu Sarkaru Vaari Paata,Pawan Kalyan - Mahesh Babu: పవన్ కళ్యాణ్ బాటలో తొలిసారి ఆ పని చేస్తోన్న మహేష్ బాబు..,Pawan Kalyan - Mahesh Babu,Pawan Kalyan,Mahesh Babu,Pawan Kalyan Mahesh Babu Box Office War,Mahesh Babu Sarkaru Vaari Paata,Pawan Kalyan Hari Hara Veeramallu,Pawan Kalyan Hari Hara Veeramallu Pan India Movie,Mahesh Babu Sarkaru Vaari Paata Pan India Project,Tollywood,Telugu cinema,పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,పవన్ కళ్యాణ్ మహేష్ బాబు,పవన్ కళ్యాణ్ మహేష్ బాబు బాక్సాఫీస్ వార్,పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్యాన్ ఇండియా మూవీస్,పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు,మహేష్ బాబు సర్కారు వారి పాట
    పవన్ కళ్యాణ్ బాటలో మహేష్ బాబు (File/Photos)


    ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌తో పాటు.. క్రిష్‌తో ప్యాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు హరీష్ శంకర్, రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. మరోవైపు మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయనున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: