Pawan Kalyan - Mahesh Babu: మహేష్ బాబును అభినందించిన పవన్ కళ్యాణ్.. వివరాల్లోకి వెళితే.. తాజాగా ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రం ఉత్తమ వినోదాత్మక చిత్రంతో పాటు ఉత్తమ నిర్మాణ సంస్థతో పాటు ఉత్తమ నృత్య దర్శకుడు విభాగాల్లో రాజు సుందరంకు జాతీయ అవార్డులు వరించాయి. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మహేష్ బాబుతో పాటు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసారు. మరోవైపు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘జెర్సీ’ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీచ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, హీరో నాని పాటు ఎడిటర్ నవీన్ నూలికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేసారు పవన్ కళ్యాణ్. ఈసారి జాతీయ అవార్డుల్లో మొత్తంగా తెలుగు సినిమాలకు ఐదు జాతీయ అవార్డులు వరించాయి. ఇక జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా కంగనా రనౌత్ ఎంపికైన సంగతి తెలిసిందే కదా. ఇక బెస్ట్ యాక్టర్స్‌గా అసురన్ సినిమాలోని నటకు ధనుశ్, భోంస్లే సినిమాలోని నటనకు మనోజ్ వాజ్‌పేయి అవార్డు అందుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 67th National Film Awards:, Dil raju, Mahesh Babu, Nani, Pawan kalyan, Tollywood