Venu Madhav | వేణుమాధవ్‌తో ఓ మంచి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్...

Venu Madhav Death | పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లో మైలురాళ్లు లాంటి సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు చిత్రాల్లోనూ వేణుమాదవ్ నటించాడు.

news18-telugu
Updated: September 25, 2019, 2:23 PM IST
Venu Madhav | వేణుమాధవ్‌తో ఓ మంచి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్...
పవన్ కళ్యాణ్‌తో వేణుమాధవ్
news18-telugu
Updated: September 25, 2019, 2:23 PM IST
టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మరణించారు. ఆయన మరణంపై పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘అందరినీ నవ్వించిన వేణుమాధవ్ ఇక లేరు అనే విషయం దిగ్భ్రాంతికి గురి చేసింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ కోలుకుంటారని అనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన మరణించడం బాధాకరం. గోకులంలో సీత సినిమా నుంచి నాతో కలసి నటించారు. హాస్యం పండించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు. మిమిక్రీలో మంచి నైపుణ్యం ఉండడంతో సెట్లో ఆనందంగా ఉంచేవారు. వర్తమాన రాజకీయ విషయాలపై ఆసక్తి చూపేవారు. వేణుమాధవ్ మృతికి, నా తరఫున, జనసేన తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

పవన్ కళ్యాణ్, వేణుమాధవ్ కలిసి నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రెండో చిత్రం గోకులంలో సీత సినిమాలో వారిద్దరూ తొలిసారి కలసి నటించారు. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లో మైలురాళ్లు లాంటి సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు చిత్రాల్లోనూ వేణుమాదవ్ నటించాడు. గుడుంబాశంకర్, బంగారం, అన్నవరం సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్, వేణుమాధవ్ వెండితెరను పంచుకున్నారు.

First published: September 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...