• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN COMMERCIAL ENTERTAINER JALSA MOVIE COMPLETED 12 YEARS PK

పవన్ కళ్యాణ్ జల్సాకు 12 ఏళ్ళు.. త్రివిక్రమ్ మాయ..

పవన్ కళ్యాణ్ జల్సాకు 12 ఏళ్ళు.. త్రివిక్రమ్ మాయ..

జల్సా సినిమాకు 12 ఏళ్లు పూర్తి (jalsa 12 years)

Pawan Kalyan Jalsa: అప్పటికే పవన్ కళ్యాణ్ వరస ప్లాపుల్లో ఉన్నాడు. ఏ సినిమా వచ్చినా కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దాంతో కొత్త సినిమా వచ్చిన ప్రతీసారి దర్శకులను పవన్ అభిమానులు..

  • Share this:
అప్పటికే పవన్ కళ్యాణ్ వరస ప్లాపుల్లో ఉన్నాడు. ఏ సినిమా వచ్చినా కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దాంతో కొత్త సినిమా వచ్చిన ప్రతీసారి దర్శకులను పవన్ అభిమానులు వేడుకుంటున్నారు. మా హీరోకు ఒక్క హిట్ ఇవ్వండి బాబూ అంటూ.. అలాంటి సమయంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది ఓ సినిమా.. అదే జల్సా. అప్పటికే పాటలు అదిరిపోయే హిట్.. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఎక్కడ విన్నా అవే. అప్పటి వరకు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో ఉన్న పాత రికార్డులన్నింటినీ తిరగరాస్తూ పాటలు దూసుకుపోతున్నాయి. అదే స్థాయి అంచనాలతో సినిమా కూడా వచ్చేసింది.


జల్సాకు తొలిరోజే మళ్లీ యావరేజ్ టాక్.. సినిమాలో పెద్దగా విషయం లేదు.. కామెడీ తప్ప ఇంకేం లేదని తేల్చేసారు. కానీ ఖుషీ తర్వాత ఏడేళ్ల పాటు ఒక్క విజయం అంటూ వేచి చూసిన పవన్ అభిమానులకు మాత్రం జల్సా ఓ విందు భోజనం అయిపోయింది. ఈ సినిమా కమర్షియల్‌గా సంచలనం. 2008లోనే 33 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది జల్సా. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు బీజం వేసింది ఈ చిత్రం. దానికి ముందు జానీ, గుడుంబా శంకర్‌, బాలు, బంగారం, అన్నవరం లాంటి సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు.

జల్సా సినిమాకు 12 ఏళ్లు పూర్తి (jalsa 12 years)
జల్సా సినిమాకు 12 ఏళ్లు పూర్తి (jalsa 12 years)


అలాంటి సమయంలో వచ్చిన జల్సా సంచలనం సృష్టించింది. పవన్ ఆకలిని తీర్చిన బ్లాక్ బస్టర్ సినిమా అయితే కాదు కానీ ఆ సమయానికి కావాల్సిన భోజనం మాత్రం పెట్టింది జల్సా. ఈ సినిమాలో కామెడీ హైలైట్. ముఖ్యంగా కొడుతున్నారమ్మా అంటూ బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. పది రూపాయలు ఇచ్చి 1000 అని చెప్పడం.. పవన్, ఇలియానా సీన్స్.. పవన్‌, బ్రహ్మానందం ఎపిసోడ్స్ ఇలా అన్నీ అదిరిపోయాయి. మరోవైపు ప్రకాష్‌ రాజ్‌ కామెడీ సీన్స్‌ కూడా సినిమాకు ప్రాణం.

జల్సా సినిమాకు 12 ఏళ్లు పూర్తి (jalsa 12 years)
జల్సా సినిమాకు 12 ఏళ్లు పూర్తి (jalsa 12 years)


మహేష్ బాబు వాయిస్ ఓవర్ మరో బలం. సినిమాలో పవన్ నక్సలిజం ఫ్లాష్‌ బ్యాక్‌ కూడా అదనపు ఆకర్షణ. అయితే దీన్ని కూడా కామెడీ చేసాడని త్రివిక్రమ్‌పై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అయితే సినిమా ఎలా ఉన్నా కూడా ప్రతీ సీన్‌లోనూ త్రివిక్రమ్‌ తన మ్యాజిక్‌ చూపించాడు. మాటలతో మాయ చేసాడు. కామెడీతో పాటు ఆలోచింపజేసే మాటలు, డైలాగ్‌లకు జల్సా కేరాఫ్‌ అడ్రస్‌. విలన్‌ను రక్తపు చుక్క రాకుండా.. ఒక్కసారి కూడా ఆయన్ని కొట్టకుండా చంపే క్లైమాక్స్ కూడా అద్భుతమే.

జల్సా సినిమాకు 12 ఏళ్లు పూర్తి (jalsa 12 years)
జల్సా సినిమాకు 12 ఏళ్లు పూర్తి (jalsa 12 years)


యుద్ధంలో గెలవడం అంటే శత్రువును ఓడించడమే కానీ చంపడం కాదంటూ త్రివిక్రమ్ చెప్పిన ఫిలాసఫీ కూడా బాగానే వర్కవుట్ అయింది. మొత్తంగా దేవీ పాటలు దుమ్ము దులిపేసాయి. అన్నీ కలిపి అప్పటి వరకు తెలుగు సినిమాలో ఉన్న కమర్షియల్ రికార్డుల్లో చాలా వరకు జల్సా తన పేర రాసుకుంది. పవన్ కోరుకున్న విజయాన్ని అందించింది ఈ చిత్రం. 2008, ఎప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం ఈ రోజుతో పుష్కరం పూర్తి చేసుకుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు