Pawan Kalyan : ధైర్యంగా మాట్లాడండి.. మీ స్కూల్ ఫీజులు ఆన్ లైన్ చేస్తే ఓకేనా.. మోహన్ బాబుకు పవన్ చురకలు..

Pawan Kalyan Photo : Twitter

Pawan Kalyan : నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై పవన్ గట్టిగానే మండిపడ్డారు. నిన్న జరిగిన “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 • Share this:
  సాయితేజ్,  (Sai Dharam Tej) దేవ కట్టా (Deva Katta) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (Republic Trailer) విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం వచ్చే నెల అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు వచ్చిన పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన్ మాట్లాడుతూ “సినీ పెద్దలకు నా విన్నపం. సినిమా టిక్కెట్లను అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలనుకుంటుంది అంటే.. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సినిమా డబ్బులు గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తే బ్యాంకులకు ఇవన్నీ చూపించి లోన్లు తీసుకోవచ్చనే కోణంలోనే ఏపీ ప్రభుత్వం ఇలాంటీ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పెట్టుబడితో సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానని చెప్పడమేమిటని ప్రశ్నించారు.

  ఈ సందర్భంగా సినిమా టికెట్స్‌ను ఆన్ లైన్ చేసినట్లే..  ధైర్యంగా మాట్లాడండి.. రేప్పొద్దున మోహన్ బాబు విద్యానికేతన్‌లో సీట్స్‌ను కూడా ఆన్‌లైన్‌లో చేయండి అంటూ మండిపడ్డారు. చిత్ర పరిశ్రమ చాలా చిన్నది అనుకుంటున్నారేమో కాదు. బడ్జెట్ చిన్నదేమో. కానీ ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. ముఖ్యంగా వైసీపీ నేతలకు చెప్తున్నా చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు, జాగ్రత్త.. అంటూ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  Akhil Akkineni : మరోసారి వాయిదా పడిన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. కొత్త డేట్ ఇదే..

  ఇక రిపబ్లిక్ సినిమా విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఈ ట్రైలర్ 4 మిలియన్ వ్యూస్‌‌కు పైగా సొంతం చేసుకుంది. ఈ ట్రైలర్ చూసిన నెటిజన్స్ మాత్రం తెగ పొగడుతున్నారు. ఇటు డైరెక్టర్‌ను అటు సాయి తేజ్‌ను.. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు.  వరుస విజయాలతో అదరగొడుతోన్న మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న 'రిపబ్లిక్' ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పోచ్చు. ఈ సినిమా ట్రైలర్‌ను చూస్తుంటూ ప్రస్తుత రాజకీయాలను చర్చించనున్నారని తెలుస్తోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. వరుసగా మూడు చిత్రాల హిట్స్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన సాయి తేజ్ హీరోగా వస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.

  రాజకీయ, అధికారిక, న్యాయ వ్యవస్థలకు మీడియా అనే నాలుగో వ్యవస్థ తోడుగా ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ రాజకీయం అనే వ్యవస్థ మిగిలిన అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టేసుకుంటే ఇక ప్రజాస్వామ్యం అన్నది ఎక్కడ వుంటుంది అనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

  Kondapolam : కొండపొలం నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్..

  అదుపుతప్పిన రాజకీయ వ్యవస్థను జ్యూడిషియరీ నియంత్రించకపోతే మరో హిట్లర్ పుడతాడు అనే డైలార్ బాగుంది. అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. జిల్లా కలెక్టర్‌గా సాయిధరమ్, రాజకీయ నాయకురాలు రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమాలో చర్చించనున్నారు దేవా కట్టా.

  ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) నటిస్తున్నారు.  మరో కీలకపాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు. 'రిపబ్లిక్' ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.

  అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా జూన్ 4న విడుదల అవ్వాల్సి ఉండేది. అయితే కరోనా దెబ్బ కొట్టింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందని కొన్ని వార్తలు రాగా... అవన్ని రూమర్స్ అని తేలింది. ఈ సినిమా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలకానుంది. జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
  Published by:Suresh Rachamalla
  First published: