Home /News /movies /

PAWAN KALYAN COMEBACK BLOCKBUSTER GABBAR SINGH MOVIE COMPLETED 8 YEARS PK

గబ్బర్ సింగ్ తిక్కకు 8 ఏళ్లు.. పవన్ కళ్యాణ్ ప్రభంజనం..

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాకు క్రేజీ టైటిల్ ఒకటి అనుకుంటున్నారు. ఇప్పుడే మొదలైంది అంటూ చిత్రమైన టైటిల్ దీనికి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాకు క్రేజీ టైటిల్ ఒకటి అనుకుంటున్నారు. ఇప్పుడే మొదలైంది అంటూ చిత్రమైన టైటిల్ దీనికి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Gabbar Singh 8 years: అప్పటికి వరసగా ఫ్లాపులు.. పదేళ్లు ఒక్క హిట్ కూడా లేదు.. వచ్చిన సినిమా వచ్చినట్లు వెళ్లిపోతుంది.. ఒక్క హిట్ దేవుడా అంటూ అభిమానులు కోరుకుంటున్న తరుణం..

అప్పటికి వరసగా ఫ్లాపులు.. పదేళ్లు ఒక్క హిట్ కూడా లేదు.. వచ్చిన సినిమా వచ్చినట్లు వెళ్లిపోతుంది.. ఒక్క హిట్ దేవుడా అంటూ అభిమానులు కోరుకుంటున్న తరుణం.. పవన్ కళ్యాణ్ కూడా ఏం చేయలేకపోతున్నాడు. అన్ని రకాల సినిమాలు ట్రై చేస్తున్నాడు కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు. మధ్యలో ఏదో జల్సా అలా కాస్త ఊరటనిచ్చింది. కానీ ఫ్యాన్స్ కోరుకున్న విజయం అది కాదు.. ఇంకేదో ఉంది. కావాలి.. కచ్చితంగా కావాలి.. ఇతర హీరోల ఫ్యాన్స్ ముందు తలెత్తుకోలేకపోతున్నారు పవన్ ఫ్యాన్స్. అదిగో అప్పుడొచ్చాడు ఓ డైరెక్టర్.. అతడి పేరు హరీష్ శంకర్.. కేవలం పవన్ కోసమే కాదు కోట్లాది మంది అభిమానుల ఆకలి తీర్చడానికి వచ్చాడు ఆయన.

గబ్బర్ సింగ్ సినిమాకు 8 ఏళ్లు (gabbar singh 8 years )
గబ్బర్ సింగ్ సినిమాకు 8 ఏళ్లు (gabbar singh 8 years )


కాస్త అత్తారింటికి దారేది స్టైల్‌లో సినిమాటిక్‌గా చెప్పాలంటే హరీష్ శంకర్ గురించి ఇలాగే చెప్పాలేమో మరి. నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది.. అంటూ పవన్ తిక్కను సరిగ్గా లెక్కలేసాడు. ఆ తిక్క పేరు గబ్బర్ సింగ్.. ఈ సినిమా వచ్చి అప్పుడే 8 ఏళ్లవుతుంది. కాలం అంత వేగంగా వెళ్లిపోతుందా అన్నట్లుంది కదా.. మే 11, 2012న విడుదలైంది గబ్బర్ సింగ్. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు.. మార్కెట్‌లో అతడి ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది లాంటి డైలాగ్స్ పవన్ కోసమే అన్నట్లుగా సరిపోయాయి.


ఏదో తెలియని మేనియా.. ముందు నుంచే ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం.. అవన్నీ నిజమైన క్షణాన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసిన వైనం.. ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉండగా అప్పుడే గబ్బర్ సింగ్ వచ్చి 8 ఏళ్లైంది. కానీ ఇప్ప‌టికీ ఇంతే కొత్త‌గా ఉంది. అదే మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే. ఆరు నుంచి అర‌వై వ‌ర‌కు గ‌బ్బ‌ర్ సింగ్‌తో ఊపేసాడు ప‌వ‌ర్ స్టార్. ప‌న్నెండేళ్ళ త‌ర్వాత ప‌వ‌న్ కు అస‌లు సిస‌లైన నిఖార్సైన విజ‌యం ఇది. ఒక్కసారి పవన్‌కు సరైన హిట్ వస్తే ఎలా ఉంటుందో చూపించిన సినిమా ఇది. తెలుగు ఇండ‌స్ట్రీ రికార్డుల‌తో చెడుగుడు ఆడుకున్నాడు గ‌బ్బ‌ర్ సింగ్.

గబ్బర్ సింగ్ సినిమాకు 8 ఏళ్లు (gabbar singh 8 years )
గబ్బర్ సింగ్ సినిమాకు 8 ఏళ్లు (gabbar singh 8 years )


ఆ సినిమా విడుదలైనపుడు అందరూ సైడ్ ఇచ్చారు.. ఎక్కడ విన్నా గబ్బర్ సింగ్ గురించే టాపిక్. సినిమాలో పవన్ పేల్చిన బుల్లెట్స్‌కు.. వచ్చిన కలెక్షన్స్‌కు లెక్కే లేకుండా పోయింది. నిన్న‌గాక మొన్నొచ్చిన‌ట్లే అనిపిస్తున్న ఈ చిత్రం వ‌చ్చి 8 ఏళ్లు అయిందంటే ఆశ్చర్యం తప్పదేమో..? అప్ప‌ట్లోనే ఈ చిత్రం 69 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ప‌వ‌న్ ఇమేజ్‌తో పాటు హ‌రీష్ శంక‌ర్ టేకింగ్.. అంత్యాక్ష‌రి ఎపిసోడ్.. క‌బ‌డ్డి ఎపిసోడ్.. దేవీ శ్రీ ప్ర‌సాద్ పాట‌లు అన్నీ వర్కవుట్ అయ్యాయి. అప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌స ప్లాపుల్లో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ చిత్రంతో బాక్సాఫీస్‌పైకి త‌న పంజా విసిరాడు.

గబ్బర్ సింగ్ సినిమాకు 8 ఏళ్లు (gabbar singh 8 years )
గబ్బర్ సింగ్ సినిమాకు 8 ఏళ్లు (gabbar singh 8 years )


గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ప‌వ‌న్ మార్కెట్ మ‌ళ్లీ అలా అలా పెరిగిపోయింది. ఆ సినిమాతో చాలా రోజుల తర్వాత కడుపులు చెక్కలయ్యేలా నవ్వించాడు కూడా. గబ్బర్ సింగ్ సరికొత్త ట్రెండ్‌కే తెరతీసింది. ఆ మరుసటి ఏడాది అత్తారింటికి దారేదితో మ‌రోసారి ఇండస్ట్రీ రికార్డులు సృష్టించాడు ఈ హీరో. నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా ఈ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ గ‌ణేష్ అయిపోయాడు. మొత్తానికి ఈ 8 ఏళ్ల విజ‌యం 80 ఏళ్ల విజ‌యం అయినా కూడా అప్ప‌టికీ గ‌బ్బ‌ర్ సింగ్ మాత్రం ఇంతే నిత్య‌నూత‌నంగా ఉంటాడేమో మ‌రి..?
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Gabbar singh, Harish Shankar, Pawan kalyan, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు