18న ‘సైరా’ ఆడియో రిలీజ్... చీఫ్ గెస్ట్‌గా వస్తున్న పవన్ కల్యాణ్

సైరా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్‌ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపి మరో అదరిపోయే వార్తను అందించింది. దీంతో ఇటు మెగాస్టార్ అభిమానులు, అటు పవన్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

news18-telugu
Updated: September 12, 2019, 3:56 PM IST
18న ‘సైరా’ ఆడియో రిలీజ్... చీఫ్ గెస్ట్‌గా వస్తున్న పవన్ కల్యాణ్
చిరంజీవి పవన్ కల్యాణ్ (Source: Twitter)
news18-telugu
Updated: September 12, 2019, 3:56 PM IST
మెగా ఫ్యామిలీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది సైరా మూవీ టీం. ఈ నెల 18న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సైరా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే భారీ ఎత్తున మొదలు పెట్టేసారు సైరా టీం. అయితే డబుల్ బోనాంజ అన్నట్లు మెగా అభిమానులకు మరో తీపి కబురు కూడా అందించారు. సైరా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్‌ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపి మరో అదరిపోయే వార్తను అందించింది. దీంతో ఇటు మెగాస్టార్ అభిమానులు, అటు పవన్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

‘సైరా’ ఆడియో రిలీజ్‌కు ముఖ్య అతిథిగా రానున్న పవన్ కల్యాణ్... తన అన్న చిరంజీవిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సైరా సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తూ.. ఇప్పటికే అన్నపై తన మమకారం చూపించారు పవన్. ఈసారి ఏకంగా అభిమానులకు ఒకే స్టేజ్‌పై అన్నదమ్ములు కనిపించనుండటంతో పవర్ స్టార్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో మెగా ఫ్యామిలీ అభిమానులంతా 18వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...