HOME »NEWS »MOVIE »pawan kalyan busy with politics and when he will come for niharika konidela marriage pk

Niharika Marriage Pawan Kalyan: మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. పాలిటిక్స్‌లో పవన్ బిజీ బిజీగా..

Niharika Marriage Pawan Kalyan: మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. పాలిటిక్స్‌లో పవన్ బిజీ బిజీగా..
నిహారిక నిశ్చితార్థం (Niharika Engagement)

Niharika Marriage Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఊహించడం కష్టమే. ఎందుకంటే సొంత ఇంట్లో జరుగుతున్న వేడుకలకు కూడా ఒక్కోసారి ఈయన రాడు. కుటుంబం అంతా కనిపించిన ఫంక్షన్స్‌లో..

  • Share this:
పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఊహించడం కష్టమే. ఎందుకంటే సొంత ఇంట్లో జరుగుతున్న వేడుకలకు కూడా ఒక్కోసారి ఈయన రాడు. కుటుంబం అంతా కనిపించిన ఫంక్షన్స్‌లో కూడా పవన్ కనిపించడు. అడిగితే అతడికి ఏవో కారణాలుంటాయంటూ మెగా కుటుంబ సభ్యులు చెప్తుంటారు. ఇప్పుడు నిహారిక పెళ్లి వేడుకల్లో కూడా పవన్ కనిపించడం లేదు. కుటుంబం అంతా కనిపిస్తున్న వేడుకల్లో పవన్ మాత్రమే కనిపించడం లేదు. కారణం ఆయన పాలిటిక్స్‌తో బిజీగా ఉండటమే. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. ఈయన షెడ్యూల్ మరో మూడేళ్ల వరకు కూడా టైట్ అయిపోయింది. అప్పటి వరకు కనీసం పక్కకు తిరిగి చూడలేని బిజీ అయిపోయాడు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉంటే ఇప్పుడు రైతులకు న్యాయం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు పవన్. జనం కోసం కదిలి జనసేనాని ముందుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌లో నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పించడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.

niharika konidela marriage,pawan kalyan at niharika engagement,pawan kalyan latest news,niharika about pawan kalyan,why pawan kalyan not in niharika wedding celebrations,pawan kalyan attend niharika marriage,pawan kalyan daughter niharika marriage,why pawan kalyan not attended niharika marriage,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్లి,నిహారిక పెళ్లిలో పవన్ పాలిటిక్స్
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన, రైతులతో మాట్లాడుతున్న జనసేనాని (Image; Janasena Party/Twitter)




ఈ క్రమంలోనే నెల్లూరులో కీలక ప్రకటన చేసాడు ఈయన. ఈ నేపథ్యంలోనే రైతుల కోసం డిసెంబర్ 7న ఆంధ్రలోని అన్ని జిల్లాలలో నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించాడు పవన్ కళ్యాణ్. తనతో పాటు జనసైనికులు కూడా ఈ దీక్షలో పాల్గొంటారని క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అయితే డిసెంబర్ 9న నిహారిక పెళ్లి ఉంది. ఒక్కరోజు ముందు దీక్షలో కూర్చుంటున్నాడు పవర్ స్టార్. దాంతో అన్న కూతురు పెళ్లికి పవన్ వస్తాడా రాడా అనేది అర్థం కావడం లేదు.

niharika konidela marriage,pawan kalyan at niharika engagement,pawan kalyan latest news,niharika about pawan kalyan,why pawan kalyan not in niharika wedding celebrations,pawan kalyan attend niharika marriage,pawan kalyan daughter niharika marriage,why pawan kalyan not attended niharika marriage,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్లి,నిహారిక పెళ్లిలో పవన్ పాలిటిక్స్
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)


అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 7 మొత్తం ఆంధ్రలోనే ఉండి.. పెళ్లికి ముందు రోజు ఉదయ్ పూర్ చేరుకుంటాడని తెలుస్తుంది. పెళ్లికి ఉండి అదే రోజు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తాడని ప్రచారం జరుగుతుంది. అప్పుడు నిశ్చితార్థానికి కూడా పవన్ ఉదయమే వచ్చి కూతురును దీవించి వెళ్లిపోయాడు. ఇప్పుడు కూడా పెళ్లికి ఎక్కువ టైమ్ కేటాయించలేకపోతున్నాడు. మరోవైపు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలు కూడా డిసెంబర్ 7న రాజస్థాన్ బయలు దేరనున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:December 06, 2020, 15:15 IST