Home /News /movies /

PAWAN KALYAN BIRTHDAY CELEBRATIONS TWO GIFTS FOR FANS HERE ARE THE DETAILS SR

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుట్టినరోజున రెండు కానుకలు...

హరి హర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ (Hari Hara Veeramallu First Look Photo : Twitter)

హరి హర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ (Hari Hara Veeramallu First Look Photo : Twitter)

Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుస సినిమాలతో సూపర్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఓ వైపు ఏపీ రాజకీయాలు చేస్తూనే ఇటు సినిమాల్లోను నటిస్తున్నారు.

  పవన్ కళ్యాణ్.. (Pawan Kalyan)  ప్రస్తుతం వరుస సినిమాలతో సూపర్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఓ వైపు ఏపీ రాజకీయాలు చేస్తూనే ఇటు సినిమాల్లోను నటిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం మూడు సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన నటించిన వకీల్ సాబ్ ఆ మధ్య థియేటర్‌లో విడుదలై అదరగొట్టింది. హిందీ పింక్ సినిమాకు తెలుగు రీమేక్‌గా వకీల్ సాబ్ వచ్చింది. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు (Venu Sri Ram) దర్శకత్వం వహించాగా.. పవన్ కళ్యాణ్‌కు జోడిగా శృతి హాసన్‌ (Shruti Haasan) నటించారు. అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే సినిమాను ఖరారు చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. పైగా దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi) కావడంతో దీనిపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈసినిమా నుంచి ఓ సాలిడ్ అప్ డేట్ రానుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే (Pawan kalyan birthday celebrations)సందర్భంగా వచ్చే సెప్టెంబర్ 2 న ఒక అదిరే పోస్టర్‌ను చిత్రబృందం లాంచ్ చెయ్యనున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ చిత్రం తాలూకా సరికొత్త రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారట. ఇక ఈ చిత్రంలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేస్తోంది చిత్రబృందం. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారట.

  చారిత్రక నేపథ్యంలో పవన్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగుతూ.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట హీరో. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయనున్నారు.

  ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర సినిమా విషయానికి వస్తే.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నారు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. త్రివిక్రమ్ మాటలు అందిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే వస్తోన్న సమాచారం మేరకు మహాశివరాత్రికి విడుదల తేదిని మార్చుతున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది. భీమ్లా నాయక్‌గా ఈ చిత్రానికి టైటిల్‌ ఖరారు చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. నివేదా పేతురాజ్, నిత్యా మీనన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి కూడా పవన్ బర్త్ డే సందర్భంగా ఓ సాలిడ్ అప్ డేట్ రానుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ లాంచ్ చేయనున్నారని తెలిపారు.

  ఇక ఆ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు సంచారి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన విడుదలకానుంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Bheemla Nayak, Hari hara veeramallu, Pawan kalyan, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు