news18-telugu
Updated: August 17, 2020, 1:03 PM IST
పవన్ కళ్యాణ్ Photo : Twitter
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే.. మరోవైపు వరుసగా సినిమాలు చేస్తూ యమ బిజీగా ఉంటున్నాడు. ఆయన ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ అయినా పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్ పేరిట రీమేక్ చేస్తున్నాడు. దిల్ రాజు, బోనీకపూర్ కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. అది అలా ఉంటే వచ్చే నెల సెప్టెంబర్ 2న ఆయన తన 50వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. దీంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా #PawankalyanBirthdayCDP అనే హ్యాష్ ట్యాగ్ పై కేవలం 23 గంటల 12 నిమిషాల్లో 60.3 మిలియన్ ట్వీట్స్ వేసి ఆల్ టైం వరల్డ్ రికార్డును సెట్ చేసి పవన్ కళ్యాణ్ పేరిట ఒక వరల్డ్ ను అందించారు. ఇప్పటి వరకు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రికార్డును తమ వసం చేసుకున్నారు పవన్ ఫ్యాన్స్. 24 గంటల వ్యవధిలో 65 మిలియన్ ట్వీట్లు వేసి సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఇప్పుడే ఇలా ఉంటే సెప్టెంబర్ 2 వ తారీఖున చేసే ట్రెండ్ ఎలా ఉండనుందో అని ఆసక్తిగా చూస్తున్నారు సినీ ప్రేక్షకులు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన వకీల్ సాబ్తో పాటు.. మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో వస్తోన్న విరూపాక్ష,తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా రానుంది.
Published by:
Suresh Rachamalla
First published:
August 17, 2020, 1:03 PM IST