హోమ్ /వార్తలు /సినిమా /

Bheemla Nayak : ఓటీటీలో పవర్ తుఫాన్ మొదలు.. స్ట్రీమింగ్‌లో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సంచలనం..

Bheemla Nayak : ఓటీటీలో పవర్ తుఫాన్ మొదలు.. స్ట్రీమింగ్‌లో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సంచలనం..

Pawan Kalyan | Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ  ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ వేదికగా సంచలనం రేపుతోంది.

ఇంకా చదవండి ...

  Pawan Kalyan | Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లోను మంచి కలెక్షన్స్ దక్కించుకుంది. భీమ్లానాయక్ (Bheemla Nayak) ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్స్‌కు పైగా కలెక్షన్స్ సాధించిందని అదరగొట్టింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ హాట్ స్టార్‌తో పాటు ఆహా కూడా భారీ ధరకు దక్కించుకుంది.  ఈ సినిమా  బుధవారం అర్ధరాత్రి నుంచి మార్చి 24న ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

  దీంతో పవన్ ఫ్యాన్స్ మరోసారి చూడోచ్చని తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   ఈ సినిమా విడుదలైన సరిగ్గా 4 వారాలకు అంటే 27 రోజులకు రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫ్లామ్స్‌‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.  గతేడాది వకీల్ సాబ్ సినిమాను కూడా విడుదలైన మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసారు.. మొన్న పుష్ప సినిమా సైతం మూడు వారాలకే వచ్చేసింది. ఇప్పుడు నాలుగు వారాల్లోనే భీమ్లా నాయక్ వచ్చేసాడు. రానా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా నటించారు. తాజాగా అక్కడ ఈ సినిమా అదరగొడుతోంది. తివిక్రమ్ పవన్ కాంబినేషన్ పవర్ ఫుల్ డైలాగ్స్ రిపీటెడ్ గా వింటూ హ్యాపీగా ఫీలవుతున్నారు.

  RRR : రాజమౌళి,ఎన్టీఆర్,రామ్ చరణ్‌ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ జర్నీ.. తెర వెనక స్టోరీ ఇదే..

  త్రివిక్రమ్ కథనం మాటలు అందించగా..సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు సాగర్ కె చంద్ర రూపొందించిన భీమ్లా నాయక్. అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి మధ్య జరిగిన సంఘర్షణను ఆస్వాదిస్తున్నారు. మలయాళ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను మనదైన స్టైల్ లో చూపించిన భీమ్లా...ఓటీటీ రికార్డులు బద్దలు కొట్టేందుకు బయలుదేరింది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. 106 కోట్ల థియెట్రికల్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్.. 97 కోట్లు వసూలు చేసింది. మరో 9 కోట్లు నష్టాల పాలయింది.

  Chiranjeevi - Salman Khan God Father : చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ సెట్‌లో సల్మాన్ ఖాన్ సందడి.. కీలక షెడ్యూల్ కంప్లీట్..

  ఏపీలో టికెట్ రేట్లు పెరిగి ఉండుంటే సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధించి ఉండేదంటున్నారు ట్రేడ్ పండితులు. మరోవైపు డిజిటల్, శాటిలైట్ అన్నీ కలిపి 200 కోట్లు దాటిపోయింది ఈ సినిమా బిజినెస్. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్నారు. దాంతో పాటు ఇక ఆ సినిమాతో పాటు (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దీంతో పాటు సురేందర్ రెడ్డి, రమేష్ వర్మ, సుధీర్ వర్మ దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు.

  First published:

  Tags: Aha OTT Platform, Bheemla Nayak, Disney+ Hotstar, Pawan kalyan, Rana daggubati, Tollywood

  ఉత్తమ కథలు