Pawan Kalyan - Bheemla Nayak : పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. ఈ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్నాదా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రీసెంట్‌గా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ షూటింగ్ విరామంలో న్ చేతపట్టి బుల్లెట్ట వర్షం కురిపించారు. దానికి సంబంధించిన వీడియో హైలెట్ అయ్యాయి. ఈ సినిమా విషయానికొస్తే.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ .. భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ తనకున్న బిజీ షెడ్యూల్స్‌తో ఈ సినిమా షూటింగ్ కొంచెం లేట్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలతో విడుదలతే థియేటర్స్ ప్రాబ్లెమ్ తలెత్తే అవకాశం ఉంది. అందుకే భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి బరిలో కాకుండా శివరాత్రికి సోలోగా విడుదల చేయాలనే నిర్ణయానికి చిత్ర నిర్మాతలు వచ్చినట్టు సమాచారం.
‘భీమ్లా నాయక్’ కొత్త రిలీజ్ డేట్ పై నిర్మాతలు త్వరలో అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకు ‘భీమ్లా నాయక్’ టైటిల్ ఫైనల్ కాదని చెబుతున్నారు. రానా పాత్రను పరిచయం చేసిన తర్వాత ఈ సినిమా అసలు పేరును ప్రకటిస్తామని చెప్పారు.ఇప్పటికే మాస్‌లో ‘భీమ్లా నాయక్’ పేరు చొచ్చుకుపోయింది. ఇలాంటి టైమ్‌లో నిర్మాతలు ‘భీమ్లా నాయక్’ పేరును మారుస్తారా అనేది చూడాలి. ఒకవేళ మార్చినా.. భీమ్లా నాయక్ వర్సెస్ డేనియల్ శేఖర్‌గా మారుస్తారా అనేది చూడాలి.
పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో పాటు ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాలోను నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా త్వరలో షూటింగ్ మళ్లీ మొదలు కానుంది . ఏ యం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో అప్పీల్ కావడంతో అన్ని భాషల్లో విడుదల చేయనుంది చిత్రబృందం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ విషయమై పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
ఎవరు మీలో కోటీశ్వరులులో అదిరిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కెమిస్ట్రీ..హైలెట్‌గా కాజల్ ప్రస్తావన.
Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..
Nara Lokesh : ఆ దర్శకుడి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న నారా లోకేష్.. కానీ అలా మిస్ అయింది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Tollywood