హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan - Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ అంటే..

Pawan Kalyan - Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ అంటే..

Pawan Kalyan - Bheemla Nayak :  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్స్‌లో విడుదల కాబోతుందంటే..

Pawan Kalyan - Bheemla Nayak :  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్స్‌లో విడుదల కాబోతుందంటే..

Pawan Kalyan - Bheemla Nayak :  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్స్‌లో విడుదల కాబోతుందంటే..

ఇంకా చదవండి ...

    Pawan Kalyan - Bheemla Nayak :  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు.మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ (KTR), తలసాని శ్రీనివాస్ యాదవ్  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు  ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు స్పెషల్ విషెస్ తెలియజేసారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను ఢీ అంటే ఢీ అనే పాత్రలో డేనియర్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి పాత్ర అదిరిపోయింది. ఈ సినిమా మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్, బిజూ మీనన్ చేసిన పాత్రలను తెలుగులో పవన్ కళ్యాన్, రానా చేసారు.

    మలయాలంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కంటే రిటైర్డ్ మిలటరీ హవాల్దార్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కానీ తెలుగుకు వచ్చేసరికి రానా పాత్రకు ప్రాధాన్యం తగ్గించి , పవన్ కళ్యాణ్  చేసిన పాత్రకు ప్రాధాన్యత పెరిగింది. ఒరిజినల్ వెర్షన్‌లో ఇద్దరి పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. అహంభావి అయిన మాజీ సైనికాధికారికీ,.ఆత్మ గౌరవం ఉన్న పోలీస్ అధికారికి మధ్య జరిగిన స్టోరీనే  ‘భీమ్లా నాయక్’. ముఖ్యంగా ఇద్దరి మధ్య ఈగో క్లాషెసే  ఈసినిమా స్టోరీ. మలయాలంలో అది బాగా సింక్ అయింది కాబట్టి అంత పెద్ద హిట్టైయింది. తెలుగులో పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ టేకప్ చేసేసరికి అంతా మారిపోయింది.

    Pawan Kalyan Remakes : భీమ్లా నాయక్ సహా పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

    అంతేకాదు అక్కడ ఈ సినిమా టైటిల్‌లో  ఇద్దరి పేర్లకు ప్రాధాన్యత ఇచ్చారు.  తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ ఇమేజ్ కారణంగా రానా పాత్రకు ప్రాధాన్యత తగ్గించేసినట్టు తెలుస్తోంది. అందుకే టైటిల్‌లో కేవలం పవన్ కళ్యాణ్ పాత్ర పేరైన ‘భీమ్లా నాయక్’నే ఈ సినిమాకు టైటిల్‌గా ఫైనల్ చేశారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు.. రానా పాత్రకు తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టే చూపించినా.. సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.

    ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Twitter/Photo)

    రానా పాత్రను పవన్ కళ్యాణ్ కారణంగా అన్యాయంగా తొక్కేసారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక రకంగా చూసుకుంటే.. ‘భీమ్లా నాయక్’ సినిమాకు ఓపెనింగ్స్ గట్రా తెచ్చేది పవన్ కళ్యాణ్ ఇమేజ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే తెలుగులో రానా పాత్రకు తక్కువ చూపించి పవన్ కళ్యాణ్‌ను హైలెట్ చేసినట్టు కనిపిస్తోంది. రానా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న మాస్‌లో అనుకున్న ఇమేజ్ ఇంకా రాలేదనే చెప్పాలి. దీంతో ఆటోమేటిక్‌గా తెలుగులో రానా పాత్రకు ప్రాధాన్యం తగ్గిపోయిందనే చెప్పాలి.

    RRR - Ukraine : ఆర్ఆర్ఆర్‌ సహా ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ భారతీయ సినిమాలు తెలుసా..

    నైజాం (తెలంగాణ): రూ. 35.00 కోట్లు

    సీడెడ్ (రాయలసీమ): రూ. 17.00 కోట్లు

    ఉత్తరాంధ్ర: రూ.  9.50 కోట్లు

    ఈస్ట్: రూ. 6.50 కోట్లు

    వెస్ట్: రూ. 5.60 కోట్లు

    గుంటూరు: రూ. 7.20 కోట్లు

    కృష్ణా:  రూ. 6.00 కోట్లు

    నెల్లూరు: రూ. 3.20 కోట్లు

    ఏపీ + తెలంగాణ: రూ. 90.00 కోట్లు

    రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 10.50 కోట్లు

    ఓవర్సీస్: రూ. 9.00 కోట్లు

    వరల్డ్ వైడ్ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్: రూ. 109.50 కోట్లు

    ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.110 కోట్ల వరకు షేర్ రావాలి. ఇప్పటి వరకు 2022లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్.. బిజినెస్ కూడా. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా

    నైజాం (తెలంగాణ)లో 350 థియేటర్స్..

    సీడెడ్ ‘రాయలసీమ): 250

    ఆంధ్ర ప్రదేశ్ : 450+

    తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ : 1075                                                                                                         కర్ణాటక + రెస్టాఫ్ భారత్ : 200+                                                                                                             ఓవర్సీస్ (విదేశాల్లో) : 600                                                                                                                     ప్రపంచ వ్యాప్తంగా 1875 థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

    ‘ భీమ్లా నాయక్’ చిత్రానికి  త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు.మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. ఇప్పటికే అమెరికాలో  అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో హాఫ్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసి వన్ మిలియన్ మార్క్ అందుకునే దిశలో పరుగులు తీస్తోంది.  భీమ్లా నాయక్’ చిత్రాన్ని ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో ఏక కాలంలో విడుదల చేద్దామనుకున్నారు. కానీ తీరా హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడం.. మరోవైపు హిందీ వెర్షన్  టీజర్, ట్రైలర్ లాంటివి విడుదల చేయలేదు. అందుకే ‘భీమ్లా నాయక్’ హిందీ వెర్షన్‌ను ఒక వారం ఆలస్యంగా అక్కడ థియేటర్స్‌లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

    First published:

    Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Tollywood

    ఉత్తమ కథలు