Pawan Kalyan - Bheemla Nayak: పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

‘భీమ్లా నాయక్’ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ (Twitter/Photo)

Pawan Kalyan - Bheemla Nayak: పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వనున్నారు.

  • Share this:
    Pawan Kalyan - Bheemla Nayak: పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వనున్నారు. ఈ గురువారం పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నుంచి  ఫస్ట్ సింగిల్‌ను ఉదయం 11.16 నిమిషాలకు  విడుదల చేయనున్నట్టు సితార ఎంటర్టైన్మెంట్ ప్రకటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమా విషయానికొస్తే..  మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ .. భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ తనకున్న బిజీ షెడ్యూల్స్‌తో ఈ సినిమా షూటింగ్ కొంచెం లేట్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలతో విడుదలతే థియేటర్స్ ప్రాబ్లెమ్ తలెత్తే అవకాశం ఉంది. అందుకే భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి బరిలో కాకుండా శివరాత్రికి సోలోగా విడుదల చేయాలనే నిర్ణయానికి చిత్ర నిర్మాతలు వచ్చినట్టు సమాచారం.


    ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు 5.04 కోట్ల రూపాయలకు ప్రముఖ సంస్థ (Aditya music) ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఈ చిత్రంల పవన్ కళ్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి (Rana Daggubati) పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

    Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

    వీరికి జంటగా నిత్య మీనన్, (Nithya menen) నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.‘భీమ్లా నాయక్’ కొత్త రిలీజ్ డేట్ పై నిర్మాతలు త్వరలో అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకు ‘భీమ్లా నాయక్‌‌‌’ టైటిల్ ఫైనల్ కాదని చెబుతున్నారు.

    Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

    రానా పాత్రను పరిచయం చేసిన తర్వాత ఈ సినిమా అసలు పేరును ప్రకటిస్తామని చెప్పారు.ఇప్పటికే మాస్‌లో ‘భీమ్లా నాయక్’ పేరు చొచ్చుకుపోయింది. ఇలాంటి టైమ్‌లో నిర్మాతలు ‘భీమ్లా నాయక్’ పేరును మారుస్తారా అనేది చూడాలి. ఒకవేళ మార్చినా.. భీమ్లా నాయక్ వర్సెస్ డేనియల్ శేఖర్‌గా మారుస్తారా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: