Home /News /movies /

PAWAN KALYAN BHEEMLA NAYAK MOVIE 1ST BREAK EVEN AREA AT OVERSEAS MARKET TA

Bheemla Nayak : ఓవర్సీస్‌లో పవన్ కళ్యాణ్ దూకుడు.. మూడో రోజుల్లోనే సేఫ్ జోన్‌లోకి ‘భీమ్లా నాయక్’..

‘భీమ్లా నాయక్’ ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ (Twitter/Photo)

‘భీమ్లా నాయక్’ ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ (Twitter/Photo)

Bheemla Nayak :  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్‌లో తొలి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. త్వరలో అక్కడ 2 మిలియన్ మార్క్ అందుకునే దిశగా సాగిపోతుంది.

    Bheemla Nayak :  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’.  ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ సంగతి పక్కన పెడితే..  గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఇంతింతై అన్నట్లుగా దూసుకుపోతుంది,. బాహుబలితో టాలీవుడు సినిమా ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. ఏ యేడాదికి ఆ యేడాది సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్‌లో పెరిగిపోతుంది. గతంలో రూ. 60 కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకు ఉండేది. ఇపుడది రూ. 100 కోట్లు దాటిపోయింది.

    బాహుబలి నుంచి ఈ ట్రెండ్ పీక్స్ వెళ్లింది. మొత్తంగా టాలీవుడ్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా బాహుబలి 2 ఇప్పటికే టాప్‌లో ఉంది. మరోవైపు తెలుగు సినిమాలకు ఓవర్సీస్ పెద్ద మార్కెట్‌గా ఉంటూ వస్తోంది. అక్కడ ప్రీమియర్స్ ద్వారానే కొన్ని సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీ యూఎస్ ప్రీమియర్స్ ద్వారానే 750 K యూఎస్ డాలర్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో మొత్తంగా రూ. 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 10. 02 కోట్లతో బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఏరియాల్లో తొలి బ్రేక్ ఈవెన్ ఇక్కడే సాధించడం విశేషం.

    Bheemla Nayak 3rd Day WW Collections : ’భీమ్లా నాయక్’ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్స్.. రూ. 100 కోట్ల క్లబ్‌లో ఎంట్రీ..

    ఓవర్సీస్ (విదేశాల్లో) తొలి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న భీమ్లా నాయక్ మూవీ  తెలంగాణలో రూ. 36 కోట్ల బిజినెస్ చేసింది. తొలి మూడు రోజుల్లో ఇక్కడ  రూ. 25.88 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. కానీ ఏపీలో మాత్రం రెండు రోజుల్లో రూ. 27.19 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసింది. పవన్ రేంజ్‌కు ఇది తక్కువే. కానీ అక్కడ పరిస్థితులు అలాగే ఉన్నాయి.  పైగా రేపు మహా శివరాత్రి ‘భీమ్లా నాయక్’కు కలిసొచ్చే అంశాలు.  మొత్తంగా బ్రేక్ కావాలంటే.. ఈ సినిమా ఇంకా రూ. 38.81 కోట్ల షేర్ రాబట్టాలి. చూడాలిక.. ముందు ముందు  ఈ సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర మాయ చేస్తుందో.

    Bheemla Nayak Over Seas : ’భీమ్లా నాయక్’ సహా ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు..


    ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను ఢీ అంటే ఢీ అనే పాత్రలో డేనియర్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి పాత్ర అదిరిపోయింది. ఈ సినిమా మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్, బిజూ మీనన్ చేసిన పాత్రలను తెలుగులో పవన్ కళ్యాన్, రానా చేసారు.మలయాలంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కంటే రిటైర్డ్ మిలటరీ హవాల్దార్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కానీ తెలుగుకు వచ్చేసరికి రానా పాత్రకు ప్రాధాన్యం తగ్గించి , పవన్ కళ్యాణ్  చేసిన పాత్రకు ప్రాధాన్యత పెరిగింది. ఇక మొదటి రోజు, రెండో రోజు మంచి  కలెక్షన్స్ సొంతం చేసుకున్న ‘భీమ్లా నాయక్’ మూడో రోజు కూడా మంచి వసూళ్లనే రాబట్టింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bheemla Nayak, Pawan kalyan, Tollywood, Tollywood Box Office Report

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు