Bheemla Nayak | Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మరో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. లాలా.. బీమ్లా.. అంటూ సాగే ఈ పాటను తివిక్రమ్ రాసారు. త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను వదిలారు.
Pawan Kalyan - Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ మూవీ ’వకీల్ సాబ్’ తర్వాత పవన్ యాక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మరో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. లాలా.. బీమ్లా.. అంటూ సాగే సాంగ్‌ను తివిక్రమ్ రాసారు. త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేసారు. హీరో పవన్ పాత్ర అయిన భీమ్లా నాయక్‌ను హైలైట్ చేస్తూ సాగే ఈ పాట నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
ఇక ఇప్పటికే భీమ్లా టైటిల్ సాంగ్‌తో పాటు అంతా ఇష్టం అంటూ పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ లపై మరో పాటను పిక్చరైజ్ చేశారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ కలిసి నటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమా విషయానికొస్తే.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.
త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ .. భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు 5.04 కోట్ల రూపాయలకు ప్రముఖ సంస్థ (Aditya music) ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి (Rana Daggubati) పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా నిత్య మీనన్, (Nithya menen) సంయుక్త మీనన్ (Samyuktha Menon) నటిస్తున్నారు. రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక ఆ సినిమాతో పాట పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ప్రకటించారు.
ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్.. తథా వ్యవహరమ్.. అనే సినిమాను చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే సినిమాను ఖరారు చేశారు.ఈ సినిమాను వచ్చే యేడాది ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.