Home /News /movies /

PAWAN KALYAN BHEEMLA NAYAK FAME STRONG WARNING TO ONE OF THE TOLLYWOOD BIG PRODUCER HERE ARE THE DETAILS TA

Pawan Kalyan : ఆ నిర్మాతకు పవన్ కళ్యాణ్ ఘాటు వార్నింగ్ ఇచ్చారా.. ? ఇంతకీ ఏం జరిగిందంటే..

పవన్ కళ్యాణ్ (File/Photo)

పవన్ కళ్యాణ్ (File/Photo)

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ఆ నిర్మాతకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ఆ నిర్మాతకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే కదా. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఈ సినిమాకు కలెక్షన్లు మరింత మరింతగా పెరిగేవి. ఈ సినిమా తర్వాత క్రిష్(Krish) దర్శకత్వంలో హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ముందుగా ఈ సినిమాను కంప్లీట్ చేయాల్సిన ఉన్నా.. ముందుగా మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్’ కోషియమ్’ సినిమా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు ‘భీమ్లా నాయక్’ అనే సినిమా టైటిల్ ఖరారు చేసారు. స్వాతంత్య్రం దినోత్సం సందర్భంగా విడుదల చేసిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    భీమ్లా నాయక్  సినిమాను  యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    Chiranjeevi : పాఠ్యాంశంగా చిరంజీవి జీవిత చరిత్ర.. ప్రభుత్వానికి బండ్ల గణేష్ విన్నపం..


    Salman Khan : సల్మాన్ అయితే నాకేంటి.. ? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సల్లూ భాయ్‌కు చుక్కలు చూపించిన యువ అధికారి..


    ఐతే.. పవన్ కళ్యాణ్ ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ’హరి హర వీరమల్లు’ సినిమా చేయాల్సింది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరిగింది.  కానీ.. పవన్ కళ్యాణ్ ముందుగా మలయాళ రీమేక్ ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో ’హరి హర వీరమల్లు’ సినిమా నిర్మాత ఏ.ఎం.రత్నంకు ఖర్చు తడిసి మోపెడు అవుతుందని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు.  ఇప్పటికే కొంత భాగం పూర్తి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్  ఆ సినిమా పూర్తి చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో తన బాధలను ఏకరువు పెట్టి పవన్ కళ్యాణ్‌గారు మిమ్మల్ని నమ్మి రూ. 150 కోట్ల బడ్డెట్ పెట్టాను కాస్త కనికరించండి అంటూ  ఓ మెసేజ్ చేసాడట.

    ఈ మెసెజ్‌తో పవన్ కళ్యాణ్‌‌కు ఎక్కడో ఇబ్బంది అనిపించిందట. ఏదైనా ఉంటే ఫోన్ చేసో.. లేదో పర్సనల్‌గా కలిసి మాట్లాడితే బాగుంటుంది. ఇలా మెసేజ్ పెట్టడమేమిటి అంటూ తన పీఏ చేత సదరు నిర్మాతకు ఫోన్ చేయించి నిర్మాత ఏ.ఎం. రత్నంకు ఓ రేంజ్‌లో క్లాస్ పీకాడట. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మీరు నన్ను నమ్మి రూ. 150కోట్లు పెట్టడం లేదు. కథను నమ్మి ఈ డబ్బు పెడుతున్నారు. నన్ను నమ్మి కాదు అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడట. నా కోసమే అన్ని డబ్బులు ఖర్చు చేస్తున్నానంటూ చెప్పుకోవడం మానుకో అంటూ ఫైర్ అయ్యాడట. పవన్ కళ్యాణ్ .. నిర్మాత ఏ.ఎం.రత్నం క్లాస్ పీకిన మ్యాటర్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: A. M. Rathnam, Bheemla Nayak, Hari hara veeramallu, Krish, Pawan kalyan, Saagar K Chandra, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు