Home /News /movies /

PAWAN KALYAN BHAVADEEYUDU BHAGAT SINGH MOVIE HARISH SHANKAR CLARIFIES ABOUT POOJA HEGDE TO PAIR OPPOSITE PAWAN KALYAN TA

Pawan Kalyan - Harish Shankar : పవన్ కళ్యాణ్ సరసన నటించేది ఆ హీరోయినే.. హరీష్ శంకర్ క్లారిటీ..

పవన్ కళ్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ (Twitter/Photo)

పవన్ కళ్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ (Twitter/Photo)

Pawan Kalyan - Harish Shankar : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమలతో బిజీగా ఉన్నారు. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరో హరీష్ శంకర్ కన్ఫామ్ చేశారు.

    Pawan Kalyan - Harish Shankar |  త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన  ‘అజ్ఞాతవాసి’ తర్వాత దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ మూవీతో పలకరించారు. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఈ సినిమా మరింత వసూళ్లు సాధించి ఉండేది. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా ‘బీమ్లా నాయక్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి అదే టైటిల్ ఖరారు చేసారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.   మరోవైపు ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో డేనియల్ శేఖర్ పాత్రలో కనిపించనున్నారు. త్రివిక్రమ్ మాటలు అందిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జవనరి 12న  విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

    మరో వైపు పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో చేస్తోన్న చారిత్రక నేపథ్యమున్న సినిమా ఇది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 29 ఏప్రిల్  2022 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  ‘భీమ్లా నాయక్’ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమా పూర్తి చేయనున్నారు.

    ఖైదీ టూ ఇంద్ర వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన చిరంజీవి సినిమాలు ఇవే..

    అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరీర్‌లో విడుదల కాబోతున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ కూడా ఇదే. గతంలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాను కేవలం తెలుగుతో పాటు హిందీలో డబ్ చేసి  ఒకేసారి విడుదల చేసారు. కానీ ‘హరి హర వీరమల్లు’ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో దేశ వ్యాప్తంగా  విడుదల చేయనున్నారు.

    Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

    ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ టైటిల్‌తో దేశ భక్తి నేపథ్యంలో ఓ సినిమా చేయనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ బైక్ పై కూర్చొని .. బ్యారెల్ గన్‌ను లోడ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రీ లుక్‌ను విడుదల చేసారు. ఆ తర్వాత టైటిల్ ‘భవదీయుడు భగత్ సింగ్’ అంటూ ఈ సినిమా టైటిల్ రివీల్ చేశారు.

    MAA Elections - Manchu Vishnu : ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్.. ఆయన బలాలు, బలహీనతలు, హామీలు, మ్యానిఫెస్టో ఇవే..


    ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాలో డైలాగ్స్, సన్నివేశాలు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా స్క్రిప్ట్‌ను హరీష్ శంకర్ తీర్చిదిద్దినట్టు సమాచారం. మొత్తంగా తన నిజ జీవిత పాత్రను తెరపై చేయనున్నడన్న మాట.

    Pawan Kalyan: పవర్ స్టార్ బిరుదును పవన్ కళ్యాణ్‌కు ఇచ్చింది ఎవరో తెలుసా..

    ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లెక్చరర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎందుకు మారాడనేదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది. ఈ విషయాన్ని అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రీ రిలీజ్ వేడుకలో కన్ఫామ్ చేసారు.



    మరోవైపు ఈ చిత్రంలో ప్రియమణి మరో కథానాయికగా యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. పూజా హెగ్డే .. హరీష్ శంకర్.. ‘డీజే’ (దువ్వాడ జగన్నాథం), సినిమాతో పాటు గద్దలకొండ గణేష్ సినిమాల్లో నటించింది. ఇపుడు ముచ్చటగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న మూడో  చిత్రంలో పూజా హెగ్డే.. పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది.

    pooja hegde will play lead role in pawan kalyan pink telugu remake,pooja hegde,pawan kalyan,pink,pink telugu remake,pawa kalyan nayanthara,nayanthara,pawan kalyan trivikram,pawan kalyan pin telugu remake,pooja hegde pawan kalyan,pink pooja hegde pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan facebook,pawan kalyan instagram,pooja hegde twitter,pooja hegde instagram,pooja hegde facebook,pooja hegde pawan kalyan trivkiram venu sriram,tollywood,telugu cinema,పూజా హెగ్డే,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్‌లో పూజా హగ్డే,పూజా హెగ్గే పింక్ రీమేక్,వేణు శ్రీరామ్, దిల్ రాజు బోనీ కపూర్,నయనతార,పవన్ కళ్యాణ్ నయనతార
    పవన్ కళ్యాణ్,పూజా హెగ్డే (Twitter/Photos)


    ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నాడు.ఆ తర్వాత పరిస్థితులు కారణంగా రాజకీయాల్లో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేదే ఈ సినిమా స్టోరీ.   అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్టు సమాచారం. ఒకటి కాలేజీ లెక్చరర్ పాత్ర అయితే.. మరోకటి ఐబీ ఆఫీసర్. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో కాలేజ్ సెట్ వేస్తున్నారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bhavadeeyudu Bhagat Singh, Harish Shankar, Mythri Movie Makers, Pawan kalyan, Pooja Hegde

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు