పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడా.. అసలు మ్యాటర్ ఇదే..

Pawan Kalyan: వినడానికి విచిత్రంగా ఉంది కదా.. పవన్ ఏంటి ముఖ్యమంత్రి కావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా.. దాని వెనక కూడా ఓ కథ ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడు కాదు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 8, 2020, 4:47 PM IST
పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడా.. అసలు మ్యాటర్ ఇదే..
ఇక పూరీ జగన్నాథ్ సైతం పవన్ పొలిటికల్ ఇమేజ్‌కు సరిపోయే కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. ఇది వరకే ఈ కాంబినేషన్‌లో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి సినిమాలు వచ్చాయి.
  • Share this:
వినడానికి విచిత్రంగా ఉంది కదా.. పవన్ ఏంటి ముఖ్యమంత్రి కావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా.. దాని వెనక కూడా ఓ కథ ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడు కాదు.. రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్న హీరో. రియల్ లైఫ్ అంటే ముఖ్యమంత్రి కావడం కష్టం కానీ సినిమాల్లో ఎంత పని. ఇప్పుడు పవన్ కూడా ఇదే చేస్తున్నాడని తెలుస్తుంది. ఈయన పింక్ సినిమా రీమేక్‌ వకీల్ సాబ్‌లో నటిస్తున్నాడిప్పుడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. మే 15న సినిమా విడుదల కానుంది కూడా. ఈ సినిమాతో పాటే క్రిష్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్. ఇది పూర్తిగా పీరియాడిక్ స్టోరీ. అన్నీ కుదిర్తే నవంబర్ 13న విడుదల కానుంది ఈ చిత్రం.

వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ (Twitter/Photo)
వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ (Twitter/Photo)


క్రిష్ సినిమాలో పవన్ దొంగగా నటిస్తున్నాడని తెలుస్తుంది. వకీల్ సాబ్‌తో పాటే క్రిష్ సినిమా కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నాడు. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ సినిమా కూడా లైన్‌లోనే ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మొదలు పెట్టనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు నాలుగో సినిమా కూడా పవన్ కోసం వేచి చూస్తుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతుందని.. ఇప్పటికే దీనికోసం ఓ లైన్ కూడా అనుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాలు పూర్తైన తర్వాత పూరీ సినిమా పట్టాలెక్కబోతుందని ప్రచారం జరుగుతుంది. పొలిటికల్ స్టోరీగా ఉండబోతున్న ఈ చిత్రంలో పవన్‌ను ముఖ్యమంత్రిగా చూపించబోతున్నాడు పూరీ జగన్నాథ్.

పవన్ కళ్యాణ్‌తో పూరీ జగన్నాథ్
పవన్ కళ్యాణ్‌తో పూరీ జగన్నాథ్


ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ సినిమాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈయన విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత పవన్ కోసం కథ రాస్తాడని తెలుస్తుంది. గతంలో ఈ కాంబినేషన్‌లో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడో సినిమా కోసం రంగం సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటిస్తారనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే పవన్ ఇలా ఎన్ని సినిమాలు చేస్తున్నాడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. దాంతో పాటే త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ సినిమా చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. రామ్ చరణ్ నిర్మాణంలోనూ పవన్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఒకవేళ ఈయన మళ్లీ వరసగా సినిమాలు చేస్తే మాత్రం అభిమానులకు ప్రతిరోజూ పండగే.
Published by: Praveen Kumar Vadla
First published: March 8, 2020, 4:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading