హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan - Bandla Ganesh: మరోసారి బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ మూవీ..

Pawan Kalyan - Bandla Ganesh: మరోసారి బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ మూవీ..

దాంతో పాటు ఇప్పుడు బండ్ల గణేష్ నిర్మాణంలో కూడా ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు పవన్. తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు పవర్ స్టార్. గబ్బర్ సింగ్, తీన్‌మార్ లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈయనకు అవకాశం ఇచ్చాడు పవన్.

దాంతో పాటు ఇప్పుడు బండ్ల గణేష్ నిర్మాణంలో కూడా ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు పవన్. తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు పవర్ స్టార్. గబ్బర్ సింగ్, తీన్‌మార్ లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈయనకు అవకాశం ఇచ్చాడు పవన్.

Pawan Kalyan - Bandla Ganesh | పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు బండ్ల గణేష్ వీరాభిమాని. ఆయన తనకు దైవంతో సమానం అని ఎన్నోసార్లు చెప్పాడు. తాజాగా వీళ్ల కాంబినేషన్‌లో మరో సినిమాకు రంగం సిద్ధం అయింది.

Pawan Kalyan-Bandla Ganesh | పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు బండ్ల గణేష్ వీరాభిమాని. ఆయన తనకు దైవంతో సమానం అని ఎన్నోసార్లు చెప్పాడు. ఆయన నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో 'తీన్ మార్','గబ్బర్ సింగ్' వంటి సినిమాలు వచ్చాయి. తీన్ మార్ సినిమా ఫ్లాప్ అయిందని పవన్ పిలిచి మరీ బండ్ల గణేష్ కు 'గబ్బర్ సింగ్' సినిమాకు అవకాశం ఇచ్చాడని ఎపుడు చెబుతుంటాడు. ఇక ఎన్టీఆర్‌తో చేసిన 'టెంపర్' సినిమా హిట్ తరువాత బండ్ల గణేష్ ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడం లేదు. ఆ తర్వాత రాజకీయాల్లో వెళ్లి.. చేతులు కాల్చుకొని.. తిరిగి మహేష్ బాబు హీరోగా నటించిన 'సరిలేరునేకెవ్వరు' సినిమాతో నటుడిగా రీఎంట్రీ ఇచ్చి వార్తల్లో నిలిచాడు బండ్ల గణేష్. తాజాగా ఈయన మరోసారి నిర్మాత అవతారం ఎత్తాడు. అది కూడా పవన్ కళ్యాణ్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించాడు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ.,. మై బాస్ సెడ్ ఓకే. వన్స్ ఎగెన్ మై డ్రీమ్ కమ్స్ ట్రూ అంటూ చేసాడు. మరోసారి పవన్ కళ్యాణ్ తనకు నిర్మాతగా ఛాన్స్ ఇచ్చినట్టు చెప్పాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమాతో పాటు క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలకు ఓకే చెప్పాడు. ఇక పవన్ కళ్యాణ్‌, బండ్ల గణేష్‌తో చేయబోయే సినిమా ఈ సినిమాల తర్వాత చేసే అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్‌తో బండ్ల గణేష్ నిర్మించబోయే ఈ  చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానకిి బండ్ల గణేష్.. తన టాలెంట్‌తో పవన్ కళ్యాణ్‌ను బుట్టలో పడేసాడని అందరు చెప్పుకుంటున్నారు.

First published:

Tags: Bandla Ganesh, Pawan kalyan, Tollywood, Vakeel Saab