పవన్ కళ్యాణ్ డ్యుయల్ రోల్.. ఫిదా అవుతున్న అభిమానులు..

చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. పింక్ సినిమా రీమేక్ పనులు మొదలుకావడంతో మళ్లీ మొహానికి రంగేసుకున్నాడు ఈయన. తాజాగా సెట్‌లో కూడా అడుగుపెట్టాడు పవర్ స్టార్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 20, 2020, 8:00 PM IST
పవన్ కళ్యాణ్ డ్యుయల్ రోల్.. ఫిదా అవుతున్న అభిమానులు..
పవన్ కల్యాణ్ (Source: Twitter)
  • Share this:
చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. పింక్ సినిమా రీమేక్ పనులు మొదలుకావడంతో మళ్లీ మొహానికి రంగేసుకున్నాడు ఈయన. తాజాగా సెట్‌లో కూడా అడుగుపెట్టాడు పవర్ స్టార్. మరోవైపు జనసేనాని కూడా ఇంకా లోపల అలాగే ఉన్నాడు. సినిమాలు చేస్తున్నాడు కదా అని జనసేనానిని మనసులోనే తొక్కేయడం లేదు పవన్ కల్యాణ్. ఆయన పనులు ఆయన కూడా చేస్తున్నాడు. అమరావతి రైతుల కోసం తనవంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు జనసేన అధ్యక్షుడు. మరోవైపు సినిమా హీరో పవన్ కల్యాణ్ మాదిరి పింక్ సినిమా రీమేక్ షూటింగ్ చేసుకుంటున్నాడు.
Pawan Kalyan balancing both movies and politics at this time with perfect planning pk చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. పింక్ సినిమా రీమేక్ పనులు మొదలుకావడంతో మళ్లీ మొహానికి రంగేసుకున్నాడు ఈయన. తాజాగా సెట్‌లో కూడా అడుగుపెట్టాడు పవర్ స్టార్. Pawan Kalyan,Pawan Kalyan politics,Pawan Kalyan janasena,Pawan Kalyan twitter,Pawan Kalyan pink remake,Pawan Kalyan ys jagan,Pawan Kalyan movies,Pawan Kalyan nagababu,Pawan Kalyan chiranjeevi politics,Pawan Kalyan pink movie shooting,Pawan Kalyan politics movies,Pawan Kalyan janasena party,Pawan Kalyan amaravati raithu,Pawan Kalyan amaravati issue,telugu cinema,పవన్ కల్యాణ్,పవన్ జనసేన,పవన్ పింక్ రీమేక్,తెలుగు సినిమా,అమరావతి పవన్ కల్యాణ్ రైతులు
పవన్ కల్యాణ్ పింక్ రీమేక్ షూటింగ్

రెండు పాత్రలను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు ఈయన. చాలా రోజులుగా వార్తల్లోనే ఉన్న పింక్ రీమేక్ ఇప్పుడు పట్టాలెక్కింది. తొలిరోజే పవన్ వచ్చాడు కూడా. అక్కడ్నుంచి నేరుగా మళ్లీ జనసేన కార్యాలయానికి వెళ్లి మిగిలిన కార్యక్రమాలు చూసుకుంటున్నాడు పవన్ కల్యాణ్. రైతుల కోసం ప్రత్యేకంగా మరో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాడు పవన్. తనకు చేతనైనంత వరకు రైతుల కోసం పోరాడతా అంటూ మాటిస్తున్నాడు జనసేనాని.

పవన్ కళ్యాణ్

మరోవైపు సినిమాకు కూడా డేట్స్ ఇచ్చాడు ఈయన. పింక్ రీమేక్ కోసం కేవలం 25 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం కోసం ఏకంగా 40 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ఈయన. మొత్తానికి అటు రాజకీయాలను.. ఇటు సినిమాలను పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నాడు పవన్. మరి అదెంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలిక.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు