Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు పవన్ కళ్యాణ్ బద్రి మొదటి సినిమా కాదు..

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌ది సెపరేట్ స్టైల్ అని చెప్పాలి. దర్శకుడిగా పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టాడు. దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు బద్రి మొదటి సినిమా కాదు.

    news18-telugu
    Updated: April 19, 2020, 9:09 PM IST
    దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు పవన్ కళ్యాణ్ బద్రి మొదటి సినిమా కాదు..
    పూరీ, పవన్ బద్రి మూవీ (Twitter/Photo)
    • Share this:
    తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌ది సెపరేట్ స్టైల్ అని చెప్పాలి. తాజాగా ఈయన దర్శకుడిగా 20 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాడు. దర్శకుడిగా పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టాడు సోమవారంతో ఈ సినిమా 20 ఏళ్లు కంప్లీటవుతోంది.  ఐతే దర్శకుడి పూరీ జగన్నాథ్‌కు బద్రి మొదటి సినిమా కాదు. వివరాల్లోకి వెళితే.. దర్శకుడిగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసాడు పూరీ జగన్నాథ్. ఈయన డైరెక్టర్‌గా పవన్ కళ్యాణ్‌తో ‘బద్రి’ సినిమా కంటే ముందు సూపర్ స్టార్ కృష్ణతో 1996లో ఒక సినిమా మొదలు పెట్టారు. ఆ సినిమాను అనుకున్న సమయానికే పూర్తి చేసినా ఏవో కారణాల వల్ల విడుదల కాలేకపోయింది, ఈ రకంగా మొదటి సినిమా విడుదల కాలేకపోయినా.. పవన్ కళ్యాణ్‌తో ‘బద్రి’ సినిమాతో మొదటిసారిగా సిల్వర్ స్క్రీన్ పై దర్శకుడిగా తన పేరును చూసుకున్నాడు.

    happy birth day dashing director puri jagannadh ,puri jagannadh,#HBDpurijagannadh,puri jagannadh krishna,puri jagannadh instagram,puri jagannadh pokira,puri jagannadh balakrishna,puri jagannadh chiranjeevi,puri jagannadh nagarjuna,puri jagannadh hit movies,puri jagannadh style,puri jagannadh twitter,puri jagannadh facebook,puri jagannadh birthday celebrations,puri jagannadh birthday,puri jagannadh movies,puri jagannadh dialogues,director puri jagannadh,puri jagannath,happy birthday puri jagannadh,puri jagannadh birthday wishes,puri jagannadh birthday special,puri jagannadh birthday special video,puri jagannadh punch dialogues,puri jagannadh birth day celebrations,puri jagannadh interview,puri jagannadh happy birthday,tollywood,telugu cinema,తెలుగు సినిమా, టాలీవుడ్ న్యూస్, పుట్టినరోజు దర్శకుడు పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్,పూరీ జగన్నాథ్ బాలకృష్ణ,పూరీ జగన్నాథ్ చిరంజీవి,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ,
    సూపర్ స్టార్ కృష్ణ,పూరీ జగన్నాథ్ (Facebook/Photo)


    ఒకవేళ కృష్ణతో చేసిన సినిమా విడుదలై ఉండుంటే మాత్రం దర్శకుడిగా ఈయన 24 ఏళ్లు కంప్లీట్ చేసుకునేవాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణతో సినిమా విడుదల కాకపోయినా.. ఆయన తనయుడు మహేష్ బాబుకు మాత్రం ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్‌ హిట్ అందించాడు. ఆ తర్వాత ‘బిజినెస్ మేన్’ వంటి డిఫరెంట్ మూవీ చేసాడు. గతేడాది రామ్‌తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మరోసారి దర్శకుడిగా సత్తా చాటాడు. అంతేకాదు ముచ్చటగా మహేష్ బాబుతో మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మరోసారి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో పాటు బాలయ్య, చిరులతో కూడా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మొత్తంగా కెరీర్‌లో ఎన్నో అప్స్ డౌన్స్ చూసిన పూరీ జగన్నాథ్.. పడినపుడల్లా గోడకు కొట్టిన బంతిలా పైకి లేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం  పూరీ విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ అనే ప్యాన్ ఇండియా  సినిమా తెరకెక్కిస్తున్నాడు.
    Published by: Kiran Kumar Thanjavur
    First published: April 19, 2020, 9:09 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading