Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయనున్న అఖిల్ దర్శకుడు..

Pawan Kalyan : మలయాళంలో సూపర్ హిటైనా సినిమాలను మెగా హీరోలు వరుసగా ఇక్కడ రీమేక్ చేస్తున్నారు.

news18-telugu
Updated: August 21, 2020, 7:15 AM IST
Pawan Kalyan :  పవన్‌ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయనున్న అఖిల్ దర్శకుడు..
పవన్ కళ్యాణ్ Photo : Twitter
  • Share this:
మలయాళంలో సూపర్ హిటైనా సినిమాలను మెగా హీరోలు వరుసగా ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. మెగాస్టార్ లూసీఫర్‌ను తెలుగులో రీమేక్ చేయడానికి ఇష్టపడుతుండగా.. ఆయన సోదరుడు పవన్ కళ్యాన్ అక్కడ ఘన విజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాడానికి చూపిస్తున్నాడు. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ దగ్గర ఉన్నాయి. కాగా ఈ తెలుగు రీమేక్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మొదట రానా, రవితేజలతో చేద్దామని భావించింది. కానీ ఎందుకో అది కుదరలేదు. ఇప్పుడు పవన్ ఈ సినిమాని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో సినిమా పైన ఆసక్తి నెలకొంది. ఇందులో పవన్ తో పాటుగా తమిళనటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తాడని సమాచారం అందుతోంది. కరోనా కారణంగా ఈ సినిమాను ఒకే షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడట.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో సమస్యల వల్ల ఒక ఊరు ఎంత ఇబ్బంది పడింది. వారి జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళంలో అయ్యప్పనాయర్ గా బిజుమీనన్, కోషి కురీన్ పాత్రలో పృథ్విరాజ్ అద్భుతంగా నటించారు. తమ పాత్రలకు ప్రాణం పోసారు. సరాసరి 3 గంటల చిత్రమిది.  త్రివిక్రమ్‌ సమర్పణలో హారిక అండ్ హాసిని ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరీ ఈ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. వెంకీ అట్లూరి గతంలో తొలిప్రేమతో పాటు మిస్టర్ మజ్ను సినిమా చేశాడు. దీనిపైన త్వరలో అధికార ప్రకటన రానుంది. ఇక పవన్ ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ అయినా పింక్‌ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
Published by: Suresh Rachamalla
First published: August 21, 2020, 6:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading