టాలీవుడ్ (Tollywood)లో రోజుకో ఇష్యూ రచ్చకెక్కుతోంది. 'మా' అసోసియేషన్ (MAA) మంటలు కొనసాగుతుండగానే.. మరో ఆసక్తికరమైన సన్నివేశం తెరపైకి వచ్చింది. ఈసారి మంచు విష్ణు (Manchu Vishnu)-పవన్ కల్యాణ్ (Pawan Kalyan). వీరిద్దరు హైదరాబాద్ (Hyderabad)లో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన అలాయ్ బలాయ్ (Alai Bhalai) కార్యక్రమానికి హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్, మా అధ్యక్షుడి హోదాలో మంచు విష్ణు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై వీరిద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. పవన్ కల్యాణ్‌తో మాట్లాడేందుకు మంచు విష్ణు యత్నించారు. కానీ పవన్ అక్కడ నుంచి పక్కకు వెళ్లిపోయారు. మంచు విష్ణును అస్సలు పట్టించుకోలేదు.
ఆ తర్వాత స్టేజిపై విష్ణు, పవన్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. కానీ పలకరించుకోలేదు. వేదికపై పవన్ కల్యాణ్ ఓ మెమొంటో తీసుకున్నారు. ఆ తర్వాత విష్ణు మెమెంటో కోసం వెళ్లాలి. ఇలా ఇద్దరూ మరోసారి ఎదురుపడ్డారు. అప్పుడు కూడా సేమ్.. సీన్. విష్ణు పక్కకు జరిగితే.. పవన్ సైలెంట్‌గా వెళ్లిపోయారు. మాటల్లేవ్.. మాటాడుకోవడాల్లేవ్. వేదికపై చాలా సేపు ఇద్దరు పక్కపక్కనే కూర్చుతున్నారు. కానీ అస్సలు మాట్లాడుకోలేదు. అసలు ఇంతకు ముందు వీరికి పరిచయమే లేదన్నట్లుగా ప్రవర్తించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... వీరి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
అహాలో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే...
అలయ్ బలయ్ అంటేనే ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం, ఆలింగనం చేసుకోవడం..! బయట రాజకీయంగా గానీ, ఇతర అంశాల్లో గానీ విభేదాలున్నా.. అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆత్మీయంగా పలకరించుకోవడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు కూడా.. కాసేపు రాజకీయాలన్నీ పక్కనబెట్టేసి, మనసారా మాట్లాడుకుంటారు. కానీ మంచు విష్ణు, పవన్ కల్యాణ్ విషయంలో ఇది కనిపించలేదు.
#PawanKalyan and #ManchuVishnu at an event pic.twitter.com/cz39I25MPH
— OverSeasRights.Com (@Overseasrights) October 17, 2021
MAA: 'మా'లో మరో రచ్చ.. రంగంలోకి పోలీసులు.. పోలింగ్ రోజు సీసీ ఫుటేజీలో ఏముంది?
ఈవెంట్‌లో ఉన్న సమయంలోనే మంచు విష్ణు ఓ వీడియోను ట్వీట్ చేశారు. అందులో అలయ్ భలయ్ వేదికపై పవన్ కూర్చొని ఉన్నారు. ఆయనెవరో గెస్ చేయండి పేర్కొన్నారు మంచు విష్ణు.
Can you guess whose at the end of the video? ?? pic.twitter.com/FJyMiWRA2T
— Vishnu Manchu (@iVishnuManchu) October 17, 2021
ఆహాలో లవ్ స్టోరి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన..
మా ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి (Chiranjeevi), మోహన్ బాబు (Mohan Babu) ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చినా ఓడిపోయారని టాలీవుడ్ టాక్. అంతేకాదు నిన్న మంచు విష్ణు ప్రమాణస్వీకార కార్యక్రమంలో కూడా మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎక్కువ మందిమి ఉన్నామంటూ మా ఎన్నికల్లో కొందరు బెదిరించారని, కానీ సభ్యులెవరూ భయపడకుండా మంచు విష్ణుకు ఓట్లు వేశారని అన్నారు. నువ్వు గొప్పా.. నేను గొప్పా అని పోటీకి పోకుండా.. అందరం కలిసి కట్టుగా ఉందని పిలుపునిచ్చారు. ఇండస్ట్రీలో ఒకరి దయాదాక్షిణ్యాల మీద అవకాశాలు రావని, ప్రతిభ ఉంటే అవకాశాలు అవే వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
కీర్తి సురేష్ తల్లి ఓ పాపులర్ హీరోయిన్ అని తెలుసా...
చిరంజీవిని ఉద్దేశించే మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. తాజా మంచు విష్ణు, పవన్ కల్యాణ్ ఒకే స్టేజిపై పక్కపక్కనే ఉన్నా మాట్లాడుకోకపోడం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఐతే ఇటీవలే మంచు విష్ణు తమ్ముడు మంచు మనోజ్.. పవన్ కల్యాణ్‌ను కలిశారు. భీమ్లానాయక్ షూటింగ్ స్పాట్‌కు ఆయనతో దాదాపు గంట సమయం పాటు మాట్లాడారు. మనోజ్‌తో కలివిడిగా మాట్లాడిన పవన్ కల్యాణ్.. మంచు విష్ణును ఎందుకు పట్టించుకోలేదన్నది తెలుగు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Vishnu, Pawan kalyan, Telugu Cinema, Tollywood