హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan: పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్‌ను కలిపిన అకీరా... ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్‌ను కలిపిన అకీరా... ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

రేణు దేశాయ్‌తో పవన్ కళ్యాణ్

రేణు దేశాయ్‌తో పవన్ కళ్యాణ్

విడాకుల తర్వాత తొలిసారిగా పవన్ కళ్యాణ్ తన మాజీ భార్య రేణు దేశాయ్‌ను కలిశారు. వీరిద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)  గురించి తెలిసిందే. ఆయన హీరోయిన్ రేణుదేశాయ్‌(Renu Desai) ను పెళ్లి చేసుకొని.. ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు ఇచ్చేశారు. పవన్, రేణుదేశాయ్‌కు ఇద్దరు పిల్లలు... ఓ కూతురు కొడుకు. కూతురు పేరు ఆద్య, కొడుకు పేరు అకీర(Akira Nandan). 2009లో పవన్, రేణు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం చేసుకున్న మూడేళ్లకే ఈ జంట విడిపోయింది. 2012లో వీరిద్దరూ విడాకులు (Divorce) తీసుకున్నారు. అయితే ఆ తర్వాత పవన్ పెద్దగా రేణు ఇంటికి వెళ్లింది లేదు. ఎక్కడా రేణు దేశాయ్‌(Renu desai)ను కలిసింది లేదు. అయితే తాజాగా పవర్ స్టార్  తన మాజీ భార్య రేణుదేశాయ్‌తో క‌లిసి ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు.

సోమ‌వారం రాత్రి సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఫొటో తెగ వైర‌ల్‌గా మారిపోయింది. ప‌వ‌న్‌, రేణు దేశాయ్‌ విడాకులు తర్వాత ఇద్ద‌రు పిల్ల‌లూ రేణు దగ్గ‌రే ఉంటున్నారు. కుమారుడు అకీరా నంద‌న్ అప్పుడ‌ప్పుడు త‌న తండ్రి వ‌ద్ద‌కు వచ్చివెళుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇండ‌స్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లో(Indus International School) చ‌దువుతున్న అకీరా నంద‌న్(Akira Nandan) సోమ‌వారం త‌న స్కూల్ గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసుకున్నాడు. ఈ కార్య‌క్ర‌మానికి రేణు దేశాయ్ త‌న కూతురుతో క‌లిసి రాగా... ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసుకున్న అకీరా నంద‌న్‌తో క‌లిసి ప‌వ‌న్‌, రేణు దేశాయ్‌, వారి కూతురు క‌లిసి ఓ ఫొటో దిగారు. సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఫొటో నిమిషాల వ్య‌వ‌ధిలోనే వైర‌ల్‌గా మారిపోయింది.

View this post on Instagram


A post shared by renu (@renuudesai)మరోవైపు రేణు కూడా ఈ ఫోటోను పోస్టు చేస్తూ.. ఎమోషనల్ అయ్యారు.‘ ఒక శకం ముగుస్తుంది మరో శకం ప్రారంభం అవుతుంది. ఒక అద్భుతమైన అబ్బాయి గ్రాడ్యుయేషన్ రోజున .. అతని తల్లిదండ్రులు గర్వపడుతున్నారు.

ఇక ఉదయాన్నే లేచీ  స్కూల్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. బస్సు టైమింగ్ గురించి టెన్షన్ కూడా అవసరం లేదు. లంచ్ బాక్స్ త్వరగా  సిద్ధం చేయాలని తొందరపడాల్సిన పని లేదు. ట్యూషన్‌లు లేవు, పేటీఎం లేదు, స్కూల్  లేదు... అతని నిజమైన ప్రయాణం ఇప్పుడు మొదలవుతుందని నేను అకిరాతో చెప్పాను,  ఇక అతనికి తన తల్లిదండ్రులు దారి చూపించాల్సిన అవసరం లేకుండా అతడే సూర్యకాంతిలో తనదైన స్థానాన్ని కనుగొంటాడని నేను ఆశిస్తున్నాను. నా చిన్న అకీరా చాలా వేగంగా పెద్దోడయిపోయాడు’ అంటూ రేణు దేశాయ్ పోస్టు చేశారు.

First published:

Tags: Akira nandan, Janasena, Pawan kalyan, Renu Desai

ఉత్తమ కథలు