Nithiin Marriage: నితిన్ పెళ్లికొడుకు ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్..

Nithiin Marriage: పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్‌లో ఉన్న భక్తుల్లో నితిన్ కూడా ఒకరు. ఈయన్ని అభిమాని అనడం సరికాదు.. ఎందుకంటే నరనరాల్లో పవన్‌పై ప్రేమను నింపుకున్నాడు నితిన్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 24, 2020, 7:00 PM IST
Nithiin Marriage: నితిన్ పెళ్లికొడుకు ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్..
నితిన్ పెళ్లి కొడుకు వేడుకలో పవన్ (pawan kalyan)
  • Share this:
పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్‌లో ఉన్న భక్తుల్లో నితిన్ కూడా ఒకరు. ఈయన్ని అభిమాని అనడం సరికాదు.. ఎందుకంటే నరనరాల్లో పవన్‌పై ప్రేమను నింపుకున్నాడు నితిన్. అందుకే ఈయన్ని భక్తుడు అంటారు. అలాంటి హీరో ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు. మొన్నటికి మొన్న స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ తన పెళ్లికి రావాలంటూ ఆహ్వానించాడు. అందులో భాగంగానే ఇప్పుడు నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్ వచ్చాడు.
నితిన్, షాలినీల పెళ్లి గోల (Twitter/Photo)
నితిన్, షాలినీల పెళ్లి గోల (Twitter/Photo)


తన ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చినబాబుతో కలిసి నితిన్ వేడుకకు వచ్చాడు పవన్. జులై 26న ఈయన షాలినిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎప్పుడో ఎప్రిల్‌లోనే జరగాల్సిన పెళ్లి కాస్తా కరోనా కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఘనంగా కాకుండా కరోనా నిబంధనలకు లోబడి ఈ పెళ్లి జరిపిస్తున్నారు కుటుంబ సభ్యులు. దీనికి టాలీవుడ్ నుంచి కానీ.. రాజకీయ రంగం నుంచి కూడా అతికొద్ది మంది మాత్రమే హాజరు కానున్నారు.

పరిస్థితులు చక్కబడిన తర్వాత ఘనంగా పార్టీ ఇవ్వాలని చూస్తున్నాడు నితిన్. ఇదిలా ఉంటే నితిన్ వేడుకకు పవన్ వచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అందులో పవన్ గెటప్ కూడా చాలా భిన్నంగా ఉంది. నితిన్ కూడా తన వేడుకకు వచ్చిన పవన్, త్రివిక్రమ్, చినబాబుకు మనసారా కృతజ్ఞతలు తెలిపాడు.
Published by: Praveen Kumar Vadla
First published: July 24, 2020, 6:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading