PAWAN KALYAN AS BHEEMLA NAYAK IN AYYAPPANUM KOSHIYUM REMAKE AND WILL RELEASING ON SANKRANTI 2022 PK
Pawan Kalyan: భీమ్లా నాయక్ ఆన్ ది వే.. సంక్రాంతికి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్..!
పవన్ కళ్యాణ్ బ్యాక్ టూ వర్క్ (Twitter/Photo)
Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయాడు. ఈయన నటిస్తున్న సినిమాలు వరసగా షూటింగ్ చేసుకుంటున్నాయి. తాజాగా మరో సినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకుంది.
పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయాడు. ఈయన నటిస్తున్న సినిమాలు వరసగా షూటింగ్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో ఎప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చాడు పవన్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో క్రిష్ హరిహర వీరమల్లు సినిమా అన్నింటికంటే షూటింగ్ ముందుగా పూర్తి చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అది గ్రాఫిక్స్ ప్లస్ విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడుకున్న భారీ సినిమా కావడంతో కొన్ని రోజులు దాన్ని పక్కనబెట్టాడు పవన్. దానికంటే ముందు మరో సినిమాను పూర్తి చేస్తున్నాడు. అదే అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్. రానా, పవన్ హీరోలుగా సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా సగానికి పైగానే పూర్తయింది.
తాజాగా ఈ చిత్ర షూటింగ్ మళ్లీ మొదలైంది. చాలా రోజుల కరోనా బ్రేక్ తర్వాత మళ్లీ సెట్లో అడుగు పెట్టారు పవన్, రానా. దీనికి సంబంధించిన అఫీషియల్ మేకింగ్ వీడియో కూడా విడుదలైంది. అందులో పవన్ భీమ్లా నాయక్‌గా కనిపిస్తున్నాడు. ఇద్దరి మధ్య ఇగో ప్రధాన కథగా ఈ చిత్రం వస్తుంది. దీనికి టైటిల్ ఇంకా పెట్టలేదు. పరశురామ కృష్ణమూర్తి అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
మరోవైపు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు మరో సినిమా వైపు చూడకూడదని ఫిక్సైపోయాడు పవన్. అందుకే రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసారు. సంక్రాంతి 2022కి కలుద్దాం అంటూ అధికారికంగా దర్శక నిర్మాతలు ప్రకటించారు. మొత్తానికి పండక్కి మరోసారి వచ్చేస్తున్నాడు పవన్. ఈయన వస్తున్నాడని తెలిసిన తర్వాత.. పోటీ పడటానికి మిగిలిన హీరోలు కూడా కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే పవన్ దండయాత్ర అలా ఉంటుంది మరి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.