• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN AND PRABHAS FANS ARE IN FULL JOSH HERE ARE THE DETAILS SR

Pawan Kalyan | Prabhas : పవన్ ప్రభాస్ న్యూ ఇయర్ గిఫ్ట్స్.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్..

Pawan Kalyan | Prabhas : పవన్ ప్రభాస్ న్యూ ఇయర్ గిఫ్ట్స్.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్..

న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన వకీల్ సాబ్, రాధేశ్యామ్ పోస్టర్స్.. Photo : Twitter

Pawan Kalyan | Prabhas : కొత్త సంవత్సరం సందర్భంగా పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్‌లు తమ ఫ్యాన్స్‌ కోసం స్పెషల్ గిఫ్ట్స్‌ను తెచ్చారు.. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.. అవేంటో చూద్దాం..

  • Share this:
    తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు దాదాపు అందరికి ఓ పీడకలగా మారింది 2020 సంవత్సరం. పోయిన సంవత్సరంలో కరోనా వలన అన్ని రంగాల వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కొత్త సంవత్సరంలోనైనా అంత మంచిజరుగుతుందిని గంపెడాశతో ఉన్నారు జనాలు. అందులో భాగంగా కొత్త సంవత్సరం సరికొత్త కలలతో ఎప్పుడు మొదలు పెడతామా అని అందరు ఎదురు చూస్తుండగా.. ఆ సమయం రానే వచ్చింది. సినిమా ఇండస్ట్రీతో పాటు మిగతా రంగాల వారు కూడా ఈ ఏడాది తమకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని సినిమాలు తమ అభిమానుల కోసం సర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌ల్ని తెచ్చాయి. ముఖ్యంగా వాటిలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్. ఈ సినిమా ఎప్పుడో విడుదలకావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడి తాజాగా షూటింగ్‌ను ముగించుకుంది. “వకీల్ సాబ్” నుంచి న్యూయర్ స్పెషల్ పోస్టర్ తో సహా టీజర్ అనౌన్స్మెంట్ వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న వకీల్ సాబ్ నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆ పోస్టర్’లో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ లు బైక్ జర్నీ చేస్తూ సింపుల్ గా అదరగొట్టారు. ఈ సినిమాను దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    ఈ సినిమాతో పాటు పవన్ మరో రెండు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఒకటి. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయినా అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. పవన్ పక్కన సాయిపల్లవి నటించనుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.


    ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. రెబల్ స్టార్ ప్రభాస్.. సాహో సినిమా తర్వాత.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. రాధే శ్యామ్ సినిమాను కూడా  రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా ఈ సినిమాకు సంబందించి ఓ కూల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. రాధే శ్యామ్ పోస్టర్ లో వింటేజ్ లుక్ లో సింపుల్ అండ్ ప్లెసెంట్ గా కనిపించి ఫ్యాన్స్ కు జోష్‌ను ఇచ్చాడు ప్రభాస్. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో అందాల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటించనుంది. మరో కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.


    ప్రభాస్ తాజాగా మరో సినిమాను కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్‌లో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సలార్ గా తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో మళయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకు బాటీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published: