పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. ఓ పాతికేళ్ళ కింద ఇలా..

Pawan Kalyan Mahesh Babu: పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం చిరంజీవి తర్వాత నెంబర్ 2 కోసం బాగా పోటీ పడుతున్న హీరోలు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 3, 2020, 10:04 PM IST
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. ఓ పాతికేళ్ళ కింద ఇలా..
పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఓల్డ్ ఫోటోస్(pawan kalyan mahesh babu)
  • Share this:
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం చిరంజీవి తర్వాత నెంబర్ 2 కోసం బాగా పోటీ పడుతున్న హీరోలు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున తరం తర్వాత నెక్ట్స్ జనరేషన్‌కు వీళ్లే పెద్దోళ్లు. ఈ తరం హీరోలకు.. సీనియర్లకు మధ్య వారధిలా ఉన్న హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. ఇప్పుడు వీళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్.. బడ్జెట్.. సినిమా రేంజ్.. రెమ్యునరేషన్ అన్నీ బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోవు. కానీ ఇప్పుడు ఇలా ఉన్న హీరోలు.. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్లో తెలుసా.. ఆ గోల్డెన్ డేస్ మళ్లీ వస్తే ఎంత బాగున్నో కదా..?

పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఓల్డ్ ఫోటోస్(pawan kalyan mahesh babu)
పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఓల్డ్ ఫోటోస్(pawan kalyan mahesh babu)

ఒక్కసారి ఈ ఫోటో చూడండి.. అందులో పవన్, మహేష్ లుక్స్ చూడండి. సినిమాల్లోకి రాకముందు తొలి సినిమా కోసం తీసుకున్న ఫోటోషూట్స్ ఇవి. అప్పట్లో తొలి సినిమా ప్రయత్నాల్లో ఉన్నపుడు ఎవరికి వాళ్లు స్టైల్‌గా ఈ ఫోటోలు తీసుకున్నారు. ఇందులో పవన్, మహేష్ పోటీ పడి మరీ లుక్స్ ఇస్తున్నారు.

పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఓల్డ్ ఫోటోస్(pawan kalyan mahesh babu)
పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఓల్డ్ ఫోటోస్(pawan kalyan mahesh babu)

ఆ తర్వాత 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో పవన్ ముందు ఎంట్రీ ఇస్తే.. ఆ తర్వాత మూడేళ్లకు 1999లో రాజకుమారుడు సినిమాతో మహేష్ వచ్చాడు. ఈ ఇద్దరూ తర్వాత సూపర్ స్టార్స్ అయ్యారు. వరస విజయాలతో ఇండస్ట్రీని కుమ్మేసారు.. ఇప్పుడు 100 కోట్లకు పైగా మార్కెట్ సొంతం చేసుకుని తెలుగు సినిమాను ఏలేస్తున్నారు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. ఆ రోజుల్లో ఇలా వాళ్ళను చూసి అభిమానులు కూడా ఆ రోజుల్లోకి వెళ్లిపోతున్నారు.
First published: April 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading