పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అప్పట్లో.. నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా..

Pawan Kalyan Mahesh Babu: పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం చిరంజీవి తర్వాత నెంబర్ 2 కోసం బాగా పోటీ పడుతున్న హీరోలు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 30, 2020, 8:06 PM IST
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అప్పట్లో.. నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా..
పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఓల్డ్ ఫోటోస్ (pawan kalyan mahesh babu)
  • Share this:
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం చిరంజీవి తర్వాత నెంబర్ 2 కోసం బాగా పోటీ పడుతున్న హీరోలు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున తరం తర్వాత నెక్ట్స్ జనరేషన్‌కు వీళ్లే పెద్దోళ్లు. ఈ తరం హీరోలకు.. సీనియర్లకు మధ్య వారధిలా ఉన్న హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. ఇప్పుడు వీళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్.. బడ్జెట్.. సినిమా రేంజ్.. రెమ్యునరేషన్ అన్నీ బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోవు. కానీ ఇప్పుడు ఇలా ఉన్న హీరోలు.. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్లో తెలుసా.. ఆ గోల్డెన్ డేస్ మళ్లీ వస్తే ఎంత బాగున్నో కదా..?

పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఓల్డ్ ఫోటోస్(pawan kalyan mahesh babu)
పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఓల్డ్ ఫోటోస్(pawan kalyan mahesh babu)


ఒక్కసారి పైన కవర్ ఫోటో చూడండి.. అందులో పవన్, మహేష్ లుక్స్ చూడండి. సినిమాల్లోకి రాకముందు తొలి సినిమా కోసం తీసుకున్న ఫోటోషూట్స్ ఇవి. అప్పట్లో తొలి సినిమా ప్రయత్నాల్లో ఉన్నపుడు ఎవరికి వాళ్లు స్టైల్‌గా ఈ ఫోటోలు తీసుకున్నారు. ఇందులో పవన్, మహేష్ పోటీ పడి మరీ లుక్స్ ఇస్తున్నారు.

పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఓల్డ్ ఫోటోస్(pawan kalyan mahesh babu)
పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఓల్డ్ ఫోటోస్(pawan kalyan mahesh babu)


ఆ తర్వాత 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో పవన్ ముందు ఎంట్రీ ఇస్తే.. ఆ తర్వాత మూడేళ్లకు 1999లో రాజకుమారుడు సినిమాతో మహేష్ వచ్చాడు. ఈ ఇద్దరూ తర్వాత సూపర్ స్టార్స్ అయ్యారు. వరస విజయాలతో ఇండస్ట్రీని కుమ్మేసారు.. ఇప్పుడు 100 కోట్లకు పైగా మార్కెట్ సొంతం చేసుకుని తెలుగు సినిమాను ఏలేస్తున్నారు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. ఆ రోజుల్లో ఇలా వాళ్ళను చూసి అభిమానులు కూడా ఆ రోజుల్లోకి వెళ్లిపోతున్నారు.
First published: June 30, 2020, 8:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading